AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: అరుదైన ఘనత సాధించిన మంత్రి కేటీఆర్‌.. ప్రపంచంలోనే టాప్‌లో..

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) మరో ఘనతను సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు దక్కించుకుని సత్తాచాటారు.

Minister KTR: అరుదైన ఘనత సాధించిన మంత్రి కేటీఆర్‌.. ప్రపంచంలోనే టాప్‌లో..
Minister Ktr
Shaik Madar Saheb
|

Updated on: Jan 17, 2023 | 3:19 PM

Share

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) మరో ఘనతను సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు దక్కించుకుని సత్తాచాటారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ప్రపంచంలోని 30 మంది టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో మంత్రి కేటీఆర్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. కాగా, భారతదేశం నుంచి ఇద్దరు యువ నాయకులకు మాత్రమే ఈ లిస్టులో చోటు దక్కింది. అందులో ఒకరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాగా, మరొకరు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ ఎంపీ రాఘవ్ చద్దా ఉన్నారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో మంత్రి కేటీఆర్ వ్యక్తిగత ఖాతాతోపాటు.. తెలంగాణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ హ్యాండిల్ వరుసగా 12, 22 స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత రాఘవ్ చద్దా 23వ స్థానంలో నిలిచారు. కాగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల జాబితాలో పర్యావరణ సామాజిక కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ అగ్రస్థానంలో నిలవగా, తర్వాత UNICEF గుడ్‌విల్ అంబాసిడర్ వెనెస్సా నకేట్, హెలెనా గువాలింగ పలువురు ప్రముఖులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల జాబితా టాప్ 30లో కేటీఆర్ నిలవడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ ఐటీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చురుగ్గా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ దావోస్ పర్యటనలో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..