- Telugu News Photo Gallery Winter weight loss tips: 5 vegetables to start eating now for burn calories
Weight Loss: మళ్లీ పాత దుస్తులను ధరించాలనుకుంటున్నారా..? జస్ట్ ఈ ఐదు ఆహారాలను తినండి చాలు..
ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. జీవనశైలి, తీసుకునే ఆనారోగ్యకరమైన ఆహారం వల్ల అధిక బరువు సమస్య పెరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే, ఎలాంటి పదార్థాలు తీసుకోకుండా డైటింగ్ అనుసరిస్తూ బరువు తగ్గడం అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Updated on: Jan 16, 2023 | 9:12 PM

ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. జీవనశైలి, తీసుకునే ఆనారోగ్యకరమైన ఆహారం వల్ల అధిక బరువు సమస్య పెరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే, ఎలాంటి పదార్థాలు తీసుకోకుండా డైటింగ్ అనుసరిస్తూ బరువు తగ్గడం అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శీతాకాలంలో బరువు నియంత్రణలో ఉంచుకునేందుకు, తగ్గేందుకు పలు ఆహారపదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. సరైన మొత్తంలో పోషకాహారం తీసుకోవడం కోసం మంచి కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Health Benefits with Raw Carrot

బచ్చలికూర: బచ్చలికూరలో ఐరన్, జింక్, మెగ్నీషియం, విటమిన్ కె, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి. ఈ కూరగాయలను రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బచ్చలికూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి కావున రోజూ తింటే బరువు పెరగకుండా ఉంటుంది.

బీట్‌రూట్: బీట్‌రూట్‌లో ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్ వివిధ విటమిన్లతో నిండి ఉంటుంది. కాబట్టి, బీట్‌రూట్ డిటాక్స్ డ్రింక్‌ని తయారు చేయడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

దుంపలు: దుంపకూరలు (బంగాళదుంపలు, గనుసుగడ్డలు, కంద) శీతాకాలంలో మార్కెట్‌లో సులభంగా దొరుకుతాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. కావున, దుంపలు తినడం వల్ల బరువు పెరుగదు. బదులుగా బరువును అదుపులో ఉంచుతుంది.

ఆవాల కూర: ఆవ కూర బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఆవకూరను అన్నంలో లేదా బ్రెడ్ తో కలిపి తింటే బరువు తగ్గుతారు.



















