Delhi Murder : పథకం ప్రకారమే మీనా మర్డర్.. స్వయంగా అంత్యక్రియలు నిర్వహించిన నిందితులు.. మిస్టరీ వీడింది..

మీనా చనిపోయిందని, మోబిన్, రెహాన్ అనే మరో వ్యక్తితో కలిసి మోబిన్ ఇంట్లో మీనాను చంపాడు. అయితే మీన హత్యను అంగీకరించిన నవీన్ పోలీసులకే షాక్‌ ఇచ్చాడు. ఆ రోజు రాత్రి..

Delhi Murder : పథకం ప్రకారమే మీనా మర్డర్.. స్వయంగా అంత్యక్రియలు నిర్వహించిన నిందితులు.. మిస్టరీ వీడింది..
Delhi Murder
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 16, 2023 | 4:12 PM

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ మహిళ హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించారు పోలీసులు. హత్యకు కారణమైన అసలు విషయం తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. హత్యకు పాల్పడిన కిల్లలర్స్‌ ప్లాన్‌ తెలిసి ఖాకీలే కంగుతిన్నారు. సాధారణంగా హంతకులు హత్యానంతరం మృతదేహాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ప్రయత్నమే చేశారు ఈ కిల్లర్స్‌ కూడా. వారు చేసిన ప్రయత్నం అందరినీ షాక్‌కు గురయ్యేలా చేసింది. ముందుగా ముగ్గురు నిందితులు మహిళను దారుణంగా చంపేశారు. అనంతరం మృతదేహంతో శ్మశానవాటికకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళ పేరు మీద సమాధి తవ్వి, తమ చేతుల మీదుగానే ఆ మహిళ మృతదేహాన్ని పూర్తి గౌరవప్రదానంగా పూడ్చిపెట్టారు.

కొత్త సంవత్సరం రెండవ రోజున మంగోల్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని అవంతిక ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న 54 ఏళ్ల మీనా వాధావన్ అనే మహిళ తన ఇంటి నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. మధ్యాహ్నం ఏదో పని మీద బయటకు వెళ్లిన ఆమె..ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు..ఇంట్లో ఎవరితోనూ మాట్లాడలేదు. పైగా, ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. దాంతో మీనా కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్‌ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మీనా అదృశ్యం ఖాకీలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇంట్లో ఎవరితోనూ ఆమె ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి, ఇంట్లో ఎవరికీ ఏమీ చెప్పకుండా ఎక్కడికైనా వెళ్లే అవకాశం లేదు. కిడ్నాప్‌కు గురైతే మాత్రం.. అందుకు ఏదో కారణం ఉండి ఉండొచ్చు. కిడ్నాపర్లు కుటుంబ సభ్యులకు కాల్‌ చేసిన తమ డిమాండ్‌లను ప్రకటించాల్సి ఉంటుంది. కానీ, ఈ విషయంలో అలాంటిదేమీ కనిపించలేదు. ఇప్పుడు కేసు దర్యాప్తు కోసం సీసీ కెమెరాల సహాయం తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.

పోలీసులు మొదట CDRని సేకరించారు.. అంటే మీనా మొబైల్ ఫోన్ కాల్ వివరాల రికార్డు. సీడీఆర్‌లో పోలీసులకు షాకింగ్ విషయం దొరికింది. మీనా చివరిగా మాట్లాడిన రెండు ఫోన్ నంబర్లు, ఆ రెండు ఫోన్ నంబర్లు ఉన్న వ్యక్తులు కూడా మీనా ఫోన్ చివరి లొకేషన్‌లో ఆమెతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే.. మీనా కనిపించకుండా పోయే ముందు ఆమె ఎవరితో మాట్లాడిందో..ఆ టైమ్లో వారు మీన వెంటే ఉన్నారని పోలీసులు తేల్చారు. విచారణలో మీనాకు సంబంధించిన కొన్ని సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు..మోబిన్, నవీన్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. మంగోల్‌పురి ప్రాంతంలో ఉంటూ ఆటోలు నడుపుతూ వీధి వ్యాపారుల వద్ద చిరువ్యాపారం చేసేవారని, విచారణలో మోబిన్ తనకు మీనా గురించి తెలుసునని, అయితే ఆమె అదృశ్యం గురించి తనకు తెలియదని చెప్పాడు. అయితే పోలీసులు నవీన్‌ను విచారించడంతో అసలు విషయం బయటపడింది. మీనా చనిపోయిందని, మోబిన్, రెహాన్ అనే మరో వ్యక్తితో కలిసి మోబిన్ ఇంట్లో మీనాను చంపాడు. అయితే నవీన్ హత్యను అంగీకరించి పోలీసులకే షాక్‌ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

మోబిన్, నవీన్, రెహాన్ వీళ్లందరికీ మీనా ముందే తెలుసు. జనవరి 2వ తేదీ రాత్రి మోబిన్‌, నవీన్‌లు మీనాను మంగారం పార్క్‌లోని మోబిన్‌ ఇంటికి పిలిపించారు. ఆపై రెహాన్‌తో కలిసి మీనాను గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత ఎవరికీ ఎలాంటి డౌట్‌ రాకుండా ఉండేందుకు గానూ..మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి బయలుదేరారు. ముగ్గురూ మృతదేహాన్ని ఆటోలో ఎక్కించుకుని నేరుగా మంగోల్‌పురి ముస్లిం శ్మశానవాటికకు చేరుకున్నారు. అక్కడ శ్మశానవాటిక కేర్‌టేకర్‌కు రూ.5,000 లంచం ఇచ్చి.. మహిళ మృతదేహాన్ని లెడ్జర్‌లో నమోదు చేయకుండా ఖననం చేయడానికి అనుమతించమని వారిని ఒప్పించారు. ఆపై నలుగురూ కలిసి రాత్రిపూట సమాధి తవ్వి మీనా మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్టుగా చెప్పాడు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. అనంతరం పోలీసులు మీనా మృతదేహాన్ని వెలికితీశారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ ముగ్గురు కలిసి మీనను ఎందుకు చంపారు..? ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికలో ఎందుకు పూడ్చిపెట్టారు? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీనా తన ఇంటి వద్ద నుంచే చిన్నపాటి ఫైనాన్స్ పనులు చేసేది. వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఆమె అప్పులు ఇచ్చేది. ఈ క్రమంలోనే నిందితులకు కూడా డబ్బు లావాదేవీకి సంబంధించి వివాదం నడుస్తోంది. మొబిన్, నవీన్, రెహాన్ డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించలేకపోయారు. కాగా మీనా తన డబ్బుల కోసం వారిని ఒత్తిడి చేస్తూ వచ్చింది. దీంతో అప్పు తీర్చలేక ఆ ముగ్గురు కలిసి ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం మీను హత్యచేసినట్టుగా పోలీసులు విచారణానంతరం వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..