AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: బట్టల దుకాణంలో మరమ్మతులు చేస్తుండగా అద్భుతం జరిగింది.. భూమిని తవ్వుతుండగా, వందల ఏళ్లనాటి వస్తువు దొరికింది..

పురావస్తు శాస్త్రవేత్తలు, దుకాణంలోని నేలమాళిగలో సుమారు మూడు వారాల పాటు గడిపారు. ఈ సమయంలో, ఇక్కడ నుండి..

Viral News: బట్టల దుకాణంలో మరమ్మతులు చేస్తుండగా అద్భుతం జరిగింది.. భూమిని తవ్వుతుండగా, వందల ఏళ్లనాటి వస్తువు దొరికింది..
Old Precious Thing
Jyothi Gadda
|

Updated on: Jan 14, 2023 | 9:36 PM

Share

ఒక వ్యక్తి తన పాత దుకాణానికి మరమ్మతులు చేసే క్రమంలో తవ్వకాలు మొదలుపెట్టాడు. దుకాణంలో అలా తవ్వుతుండగా,ఒక చోట అకస్మాత్తుగా అతనికి 40 అడుగుల లోతైన బావి కనిపించింది. అది చూసిన అతడు ఆశ్చర్యపోయాడు. ఆ బావి సుమారుగా 240 ఏళ్ల నాటిదిగా తెలిసింది. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. బ్రిటన్‌లోని లివర్‌పూల్ నగరంలో బయటపడ్డ ఈ బావి ఇప్పుడు..హాట్‌ టాపిక్‌గా మారింది. వ్యాపారవేత్త జెఫ్ పియర్స్ దుకాణంలో జరిగింది ఈ సంఘటన. తన ఫ్యాషన్ స్టోర్ రిపేర్ చేస్తున్న క్రమంలో బయటపడ్డ బావిని చూసి అతడు..తన కళ్లను తానే నమ్మలేకపోయానని జెఫ్ చెప్పాడు. ఈ షాప్ గత కొన్నాళ్ల క్రితమే కొన్నానని జెఫ్ చెప్పాడు.

ఈ సంఘటన గురించి ఇటీవల లివర్‌పూల్ ఎకోతో మాట్లాడారు. జెఫ్ తన దుకాణాన్ని 2001లో ప్రారంభించాడు. ఈ బావి 17వ శతాబ్దానికి చెందినదని సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు జెఫ్‌కు తెలిపారు. దాదాపు 40 అడుగుల లోతులో ఉంది. జెఫ్ చాలా సంవత్సరాల క్రితం UKలోని లివర్‌పూల్‌లోని బోల్డ్ స్ట్రీట్ ప్రాంతంలో ఈ దుకాణాన్ని విక్రయించినప్పటికీ, దుకాణంలో ఉన్న బావి ఇప్పటికీ ఉంది. ఇప్పుడు సోహో బ్రాండ్‌కు చెందిన పాతకాలపు బట్టల దుకాణం ఉంది.

2001లో, జెఫ్ ఈ దుకాణం బేస్‌మెంట్‌ను రిపేర్ చేస్తున్నప్పుడు, అతను నేలమాళిగలో శతాబ్దాల నాటి బావిని చూశాడు. దీన్ని బాగా చూసినప్పుడు తన కళ్లను తానే నమ్మలేకపోయానని జెఫ్ తెలిపాడు. ఆ సమయంలో బేస్‌మెంట్‌లో 8 మంది పని చేస్తున్నారు. దాదాపు 40 అడుగుల లోతులో ఉన్న ఈ బావి కింద నీరు కూడా కనిపించింది.

ఇవి కూడా చదవండి

జెఫ్ ఈ నివేదికలో అది ఎలుక చేసిన రంధ్రం అని తాను మొదట భావించానని, కానీ అది చాలా లోతుగా ఉందని చెప్పాడు. అప్పుడు టార్చ్ వెలిగించి చూశామని చెప్పాడు. సంఘటన జరిగిన మరుసటి రోజు, లివర్‌పూల్ కార్పొరేషన్ నుండి బిల్డింగ్ రెగ్యులేషన్స్ ఇన్‌స్పెక్టర్లు వచ్చారు. బావిని పూడ్చేయటమే మంచిదన్నారు. కానీ, జెఫ్ ఈ ఇన్స్పెక్టర్లతో ఏకీభవించలేదు.ఆ తర్వాత అతను లివర్‌పూల్ మ్యూజియంతో సంబంధం ఉన్న అధికారులను పిలిచాడు. వారు ఈ బావి చాలా ఏళ్ల నాటిదని, చారిత్రాత్మకమైనదని తేల్చారు. పురావస్తు శాస్త్రవేత్తలు, దుకాణంలోని నేలమాళిగలో సుమారు మూడు వారాల పాటు గడిపారు. ఈ సమయంలో, ఇక్కడ నుండి మట్టి పైపు, పింగాణీతో చేసిన అనేక చారిత్రక విషయాలు కనుగొన్నారు. ‘బోల్డ్ స్ట్రీట్’ ప్రాంతం ఓపెన్ ఫీల్డ్‌గా ఉన్నప్పుడు బహుశా ఈ బావిని నిర్మించి ఉండవచ్చు. ఈ బావి నీటిని త్రాగడానికి ఉపయోగించవచ్చని నిపుణులు సూచించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..