20ఏళ్లుగా వైద్యం చేస్తున్న లేడీ డాక్టర్‌.. దాదాపు రూ.10కోట్లు సంపాదించింది.. అసలు ట్విస్ట్‌ ఏంటంటే..

సదరు లేడీ డాక్టర్.. తనపై వచ్చిన ఆరోపణలు మొత్తం 17 కేసులను తిరస్కరించింది. ఆమెపై కోర్టులో విచారణ దాదాపు 5 వారాల పాటు సాగుతుందని చెబుతున్నారు.

20ఏళ్లుగా వైద్యం చేస్తున్న లేడీ డాక్టర్‌.. దాదాపు రూ.10కోట్లు సంపాదించింది.. అసలు ట్విస్ట్‌ ఏంటంటే..
Doctor
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 14, 2023 | 9:07 PM

ఓ మహిళ గత కొన్నేళ్లుగా రోగులకు వైద్యం చేస్తూనే ఉంది. వైద్య వృతిని కొనసాగిస్తూ..దాదాపు10 కోట్లకు పైగా సంపాదించింది. గత 20 ఏళ్లుగా ఆమె సైకోథెరపిస్ట్‌గా పనిచేస్తుంది. అయితే, మహిళ పత్రాలను పరిశీలించగా ఆమె రహస్యం బట్టబయలైంది. ఎట్టకేలకు ఆ కేడీ లేడీ డాక్టర్‌ భాగోతం బయటపడటంతో సదరు మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హజరుపరిచారు..ఈ ఘటన UKలోని మాంచెస్టర్ లో వెలుగు చూసింది. మాంచెస్టర్‌ క్రౌన్ కోర్ట్‌లో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న జోలియా అలెమీ అనే మహిళ నకిలీ డాక్టర్‌గా కొనసాగుతున్నట్టుగా ఆరోపణలను ఎదుర్కొన్నారు. కానీ, ఈ మహిళ తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తాను న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదివానని, తనపై వచ్చిన ఆరోపణలు బూటకమని జోలియా పేర్కొన్నారు.

న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ప్రాసిక్యూటర్ క్రిస్టోఫర్ స్టేబుల్స్ మాట్లాడుతూ, జోలియా తనను తాను నిజాయితీపరురాలిగా చెప్పుకునేదని, అయితే ఆమె మోసగత్తె అన్నారు. ఆమె ఫోర్జరీకి పాల్పడ్డారని,1995లో జొలియా డిగ్రీని ఫోర్జరీ చేసి జనరల్ మెడికల్ కౌన్సిల్ (జిఎంసి)కి వెరిఫికేషన్ కోసం పంపిందని, తద్వారా తాను యుకెలో రిజిస్టర్డ్ డాక్టర్ అయ్యారని క్రిస్టోఫర్ కోర్టుకు తెలిపారు. జోలియా వయస్సు ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు, ఆమె UKలోని బర్న్లీ నగరంలో నివసిస్తోంది. 1998-2017 మధ్య, ఆమె అనేక ప్రసిద్ధ సంస్థలలో మానసిక వైద్యురాలిగా పనిచేసింది. అలా చాలా డబ్బు సంపాదించింది. నకిలీ డాక్టరేట్ డిగ్రీ ఆధారంగా జోలియా రూ.10 కోట్లకు పైగా సంపాదించారని క్రిస్టోఫర్ కోర్టులో పేర్కొన్నారు.

జోలియా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జన్మించినట్లు వార్త నివేదికలో చెప్పబడింది. కానీ ఆమె 1986లో న్యూజిలాండ్‌లో సమర్పించిన పత్రాలు ఆమె మరుసటి సంవత్సరం వివాహం చేసుకున్నట్లు చూపిస్తుంది, అక్కడ ఆమె తన వృత్తిని నర్సుగా పేర్కొంది. కోర్టు విచారణ సందర్భంగా, జోలియా తనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 17 కేసులను తిరస్కరించింది. ఆమెపై కోర్టులో విచారణ దాదాపు 5 వారాల పాటు సాగుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ..