AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: సంవత్సరాలుగా మండుతున్న కొండ.. ఎక్కడుందో మీకు తెలుసా.. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..

విపరీతంగా పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా పలు ప్రాంతాల్లో మంచు తుఫాను విధ్వంసం కొనసాగుతోంది. ఎప్పుడు వచ్చినా వందల మంది ప్రాణాలు తీస్తోంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్‌లో హిమపాతం సంభవించింది. వెంటనే అలర్ట్...

Trending Video: సంవత్సరాలుగా మండుతున్న కొండ.. ఎక్కడుందో మీకు తెలుసా.. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..
Burning Mountain
Ganesh Mudavath
|

Updated on: Jan 15, 2023 | 7:09 AM

Share

విపరీతంగా పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా పలు ప్రాంతాల్లో మంచు తుఫాను విధ్వంసం కొనసాగుతోంది. ఎప్పుడు వచ్చినా వందల మంది ప్రాణాలు తీస్తోంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్‌లో హిమపాతం సంభవించింది. వెంటనే అలర్ట్ అయిన రెస్క్యూ టీమ్.. ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అయితే వీటన్నింటి మధ్యలో కొన్నాళ్లుగా నిప్పులు చెరుగుతున్న పర్వతం ఉందని మీకు తెలుసా. లేకుంటే ఈ స్టోరీ చదివేయండి.. ప్రపంచంలో వింత ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఒళ్లు గగుర్పొ్డిచే వింతలు, ప్రాంతాలకు కొదవ లేదు. అజర్‌బైజాన్‌లో ఉన్న ఓ ప్రదేశం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అక్కడ ఒక పర్వతం సంవత్సరాలుగా కాలిపోతోంది. ఈ అగ్ని ప్రమాదం ఎంత పాతదో ఎవరికీ తెలియదు. దీని వెనుక కారణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ కొండను స్థానిక భాషలో యానార్ దాగ్ అని పిలుస్తారు. అంటే ‘మండే కొండ’ అని అర్థం.

ఈ పర్వతానికి సంబంధించిన వీడియోను @aureliestory అనే ట్రావెల్ బ్లాగర్ ఇటీవల షేర్ చేయడంతో వైరల్ గా మారింది. చల్లని, బలమైన గాలులు కూడా ఈ అగ్నిని ఆర్పివేయకపోవడం విశేషం. ఈ మంటలు కొండ దిగువన 10 మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. దీని కారణంగా అజర్‌బైజాన్‌ను ‘ల్యాండ్ ఆఫ్ ఫైర్’ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు ఈ మండే కొండను చూడటానికి వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

శాస్త్రవేత్తల ప్రకారం.. రాజధాని బాకు సమీపంలో యానార్ డాగ్ అనే పర్వతం ఉంది. ఇక్కడ సహజ వాయువుల లీకేజీ కారణంగా మంటలు వస్తుంటాయి. ఈ మంటల కారణంగా వాతావరణంలో గ్యాస్ వాసన వస్తోంది. టెంపుల్ ఆఫ్ ఫైర్ అని పిలువబడే ఈ ప్రదేశంలో దుర్గామాతకు సంబంధించిన పురాతన ఆలయం కూడా ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..