Hair loss treatment: రోజూ ఆహారంలో వాడే ఈ పదార్ధం మీకు బట్టతలని కలిగిస్తోంది!..అదేంటో తెలుసా..?
వాస్తవానికి పరిశోధకులు 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల 1000 మంది ఆరోగ్యవంతమైన పురుషులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ పరిశోధనలో షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది.
ఈ రోజుల్లో ప్రజల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో యువత కూడా బట్టతల బారిన పడుతున్నారు. దీని వెనుక చాలా కారణాలున్నాయి. ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. అర్థరాత్రి వరకు పనిచేయడం, గంటల తరబడి మొబైల్ ఫోన్ చూడడం, కంప్యూటర్ పై పనిచేయడం వంటి జీవనశైలిలో వచ్చిన మార్పులే ఇందుకు కారణం. అటువంటి పరిస్థితిలో మీరు బట్టతలని నివారించాలనుకుంటే దీన్ని గుర్తుంచుకోండి.
బట్టతలకి కారణమేమిటి? చైనాలోని సింఘువా యూనివర్సిటీలో జరిపిన ఓ పరిశోధనలో షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరిపిన ఒక పరిశోధన ప్రకారం, ఆహారంలో బేకింగ్ సోడాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పురుషులలో బట్టతల సమస్య పెరుగుతోంది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పురుషుల్లో జుట్టు రాలిపోయే ప్రమాదం 57 శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. వాస్తవానికి పరిశోధకులు 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల 1000 మంది ఆరోగ్యవంతమైన పురుషులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అలాంటి పురుషులు రోజుకు ఒక్కసారైనా సోడా తాగుతారని తేలింది. వీరికి జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువ. మీరు కూడా సోడా ఎక్కువగా తాగుతున్నట్టయితే జాగ్రత్తగా ఉండాలి.
సోడా తాగడం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఈ పరిశోధనలో తేలింది. ఈ నివేదిక ప్రకారం, వారానికి ఒకసారి సోడా తాగే పురుషులకు జుట్టు రాలిపోయే ప్రమాదం 21 శాతం ఎక్కువ. మరోవైపు, పురుషులు వారానికి రెండు నుండి నాలుగు సార్లు సోడా తాగితే, ఈ ప్రమాదం 26 శాతానికి పెరుగుతుంది. ఈ విధంగా సోడా వినియోగం మీకు రిస్క్ తప్పదని గుర్తుంచుకోవాలి..
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..