Shocking: అంతా మేకప్ మహిమ.. గాఢంగా ప్రేమించాడు.. ఘోరంగా మోసపోయాడు.. చివరికి ఊహించని ట్విస్ట్..

అరచేతిలో ప్రపంచం.. తోడు కోసం ఆరాటం.. ఈ క్రమంలోనే ఓ యువకుడికి ఆన్‌లైన్ అందమైన అమ్మాయి మొహం కనిపించింది. ఇంకెముంది.. మనోడు రెచ్చిపోయాడు.. ఆమె కూడా అటు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Shocking: అంతా మేకప్ మహిమ.. గాఢంగా ప్రేమించాడు.. ఘోరంగా మోసపోయాడు.. చివరికి ఊహించని ట్విస్ట్..
Love Story
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 17, 2023 | 6:14 PM

అరచేతిలో ప్రపంచం.. తోడు కోసం ఆరాటం.. ఈ క్రమంలోనే ఓ యువకుడికి ఆన్‌లైన్ అందమైన అమ్మాయి మొహం కనిపించింది. ఇంకెముంది.. మనోడు రెచ్చిపోయాడు.. ఆమె కూడా అటు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకరినొకరు చాటింగ్ చేసుకున్నారు.. ఆ తర్వాత కలుసుకున్నారు. కానీ, ప్రేమ మోజులో ఆ గురుడు.. అమ్మాయి వయస్సు, ఆమె వేసుకున్న మేకప్ ను కనిపెట్టలేకపోయాడు. చివరకు ఆమె.. అమ్మాయి కాదు.. అమ్మమ్మ అని తెలిసి పాపం.. బిక్క మొహం వేశాడు. ఇలాంటి కష్టం మరెవరికి రావొద్దంటూ.. లొలోపల కుమిలిపోయాడు. ప్రస్తుత ఇంటెర్నెట్ యుగంలో ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది ప్రేమికులుగా మారుతున్నారు. సోషల్ మీడియాలో స్నేహం కాస్త.. ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తోంది. ఇదే తరుణంలో మోసం కూడా జరుగుతోంది. మంచి మంచి అమ్మాయిల ఫొటోలు డీపీలుగా పెట్టి.. డబ్బులు వసూలు చేయడం, అందంగా లేకపోయినా అమ్మాయిలు మంచి ఫొటోలు పెట్టి మోసం చేయడం.. ఇలా ఎన్నో ఘటనలు తరచూ తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో విచిత్రమైన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే చైనాలో తెరపైకి వచ్చింది. ఇది వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఒక అబ్బాయికి.. తన గర్ల్ ఫ్రెండ్ అమ్మమ్మ కాబోతోందని తెలిసి ఒక్కసారిగా షాకయ్యాడు.

వాస్తవానికి ఈ సంఘటన చైనాలోని ఒక ప్రాంతంలో జరిగింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. యువకుడి వయస్సు దాదాపు 22 సంవత్సరాలు. ఏడాది క్రితం సోషల్ మీడియా ద్వారా ఓ అమ్మాయితో స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముందిలే అనుకుని.. యువకుడు అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే అనడంతో ఆనందంలో మునిగితేలాడు. కలుద్దామంటూ మెస్సెజ్ చేశాడు.. ఆతర్వాత వారిద్దరూ ఓ ఏకాంత ప్రదేశంలో కలిశారు. కలుసుకున్నప్పుడు ఇద్దరూ ఒకరితో ఒకరు చాలాసేపు మాట్లాడుకున్నారని.. అయితే అప్పుడు ఆమె వయస్సును ఏ మాత్రం కనిపెట్టలేకపోయాడు.

యువకుడు ఆ అమ్మాయి (అమ్మమ్మ) తనను కలిసినప్పుడు తన వయసును దాచుకోవడానికి చాలా మేకప్ వేసుకుందని కథనంలో వివరించారు. గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్న యువకుడు.. తన ప్రియురాలు తన కంటే చాలా పెద్దదని గ్రహించలేకపోయాడని.. ఆ పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో ప్రియురాలి మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో టెన్షన్ పడ్డాడు.

ఇవి కూడా చదవండి

ప్రియురాలి కుటుంబాన్ని సంప్రదించేందుకు అబ్బాయి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరగా, కొన్ని రోజుల తర్వాత, అతని స్నేహితురాలు అతని కంటే ఇరవై సంవత్సరాలు పెద్దదని.. ఆమె అమ్మమ్మ కాబోతోందని తెలిసి యువకుడు షాక్ అయ్యాడు. చివరికి అతని స్నేహితురాలు స్వయంగా అతనికి ఫోన్ చేసి అసలు కథ మొత్తం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదంతా ఎందుకు దాచావని అమ్మమ్మని.. యువకుడు అడిగగా.. ఆమె సమాధానం చెప్పలేదని కథనంలో వివరించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..