AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈయన ఎవరో గుర్తుపట్టారా..? కళ్లు ఉరిమి చూసినా.. కన్నెర్ర చేసినా వెన్నులో వణుకే..

బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన విలన్‌లలో ఒకరు ఈయన. తెలుగులో తక్కువ సినిమాలు చేసినా మార్క్ సుస్పష్టం. గట్టిగా ఉరిమి చూశాడంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.

Tollywood: ఈయన ఎవరో గుర్తుపట్టారా..? కళ్లు ఉరిమి చూసినా.. కన్నెర్ర చేసినా వెన్నులో వణుకే..
Guess This Actor
Ram Naramaneni
|

Updated on: Jan 17, 2023 | 6:34 PM

Share

నేడు దిగ్గజ నటుడు అమ్రిష్ పూరి 90వ జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవడు వర్ధన్ పూరి ఇన్‌స్టాగ్రామ్‌లో దివంగత నటుడిని గుర్తు చేసుకున్నారు. అన్ని భాషల్లో కలిపి దాదాపు 450కి పైగా చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించారు అమ్రిష్. అయితే ఆయన 21 సంవత్సరాల వయస్సులో మొదటి స్క్రీన్ టెస్ట్ సమయంలో దారుణంగా రిజెక్ట్ చేయబడ్డారట. అయినా కూడా ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో ముందుకు సాగి తన కలను నెరవేర్చుకన్నారట. ఈ విషయాన్ని.. అమ్రిష్ పూరి మనవడు వర్ధన్.. సుధీర్ఘ పోస్ట్‌లో వెల్లడించాడు. నీది భయంకరమైన ముఖం, కఠినమైన స్వరం..  నువ్వు ఎప్పటికీ హీరోవి కాలేవని.. ఓ పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ అమ్రిష్ పూరిని దారుణంగా అవమానించారట. ఆపై అలాంటి అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి.

అయితే ఛీత్కారాలు, అవమనాలు.. తర్వాత ఒకానొక రోజు నుంచి తనకు తాను స్పూర్తినిచ్చుకోవడం ప్రారంభించారట అమ్రిష్ పూరి.  ‘నేను భిన్నంగా కనిపిస్తున్నాను. నా వాయిస్ కూడా విభిన్నంగా ఉంటుంది. ఇది నిజం! అయితే వీళ్లంతా ఇవి నా బలహీనతలు అని చెబుతున్నారు. వాటినే నేను బలాలుగా మార్చుకుంటాను. ఆపై ఏదో ఒక రోజు ప్రపంచం నన్ను గుర్తిస్తుంది. నా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, విలన్, క్యారెక్టర్ యాక్టర్‌గా నెగ్గగలుతాను’ అని పట్టుదలను ప్రదర్శించేవారు. అలా ముందుకు సాగి పంజాబ్‌లోని నవాషహర్‌లో దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఈ కుర్రాడు లెజండరీ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. 70వ దశకంలో సహాయ నటుడిగా అనేక చిత్రాలలో పనిచేశారు. 1982లో విడుదలైన సుభాష్ ఘాయ్ చిత్రం ‘విధాత’లో అమ్రీష్ పూరి తొలిసారిగా ప్రధాన విలన్ పాత్రలో కనిపించారు. తన గాత్ర బలంతో, నటనతో ఎన్నో పాత్రలు పోషించాడు. ఆయన పోషించిన అనేక విలన్ పాత్రలు ఇప్పటికీ ప్రజలకు గుర్తుండిపోతాయి.

మొగాంబో మొదట అమ్రిష్ పురి కాదు అనుపమ్ ఖేర్..

1987లో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలో అమ్రిష్ పూరి ‘మొగాంబో’ పాత్రలో కనిపించారు. ‘మొగాంబో ఖుష్ హువా’ అనే డైలాగ్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అయితే ఆ పాత్రకు మొదట అనుపమ్ ఖేర్‌ని ఎంపిక చేశారన్న సంగతి కొందరికే తెలుసు. మొగాంబో పాత్రకు అనుపమ్ ఖేర్ ఎంపిక చేసిన తర్వాత అతను సినిమా షూటింగ్ కూడా ప్రారంభించాడు. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విలన్ పాత్రపై శేఖ‌ర్ క‌పూర్ సంతృప్తి చెందలేదు. అందుకే అమ్రిష్ పూరీతో చర్చలు జరిపారు. అమ్రీష్ పూరి ఈ పాత్రకు బాగా సూట్ అవుతాడని భావించి అతనితో నేరుగా చర్చించారు. ఆ తర్వాత శేఖర్ కపూర్ ‘మొగాంబో’ పాత్రను అమ్రిష్ పూరికి ఇచ్చాడు. ఈ చిత్రంలో అతని నటన నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది.

కేవలం ఆయన రూపాన్ని చూస్తేనే వెన్నులో వణుకుపుట్టేది.  ఉబ్బిన కళ్లలో ఉరిమి చూస్తే.. పిల్లలకు అయితే సాయంత్రానికి జ్వరం తగలాల్సిందే.  తెలుగులో  కొండవీటి దొంగ, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ఆదిత్య 369’, ‘అశ్వమేథం’, ‘నిప్పురవ్వ’, ‘మేజర్ చంద్రకాంత్’  ఆయనకు మంచి పేరు తెచ్చాయి. కన్నడ, తమిళ సినిమాల్లో కూడా మెప్పించారు. ఇండియాన జోన్స్ లాంటి హాలీవుడ్ చిత్రంలో కూడా నటించి అదరగొట్టాడు.

అమ్రిష్ పూరి మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అనే అరుదైన రక్త క్యాన్సర్‌తో 12 జనవరి 2005న తుదిశ్వాస విడిచారు. 13 జనవరి 2005న శివాజీ పార్క్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం