Watch Cctv Footage: ఢిల్లీ వీధుల్లో దొంగల హల్‌చల్‌.. సినిమా రేంజ్‌లో దారి దోపిడీ.. వైరలవుతున్న వీడియో..

అతడు ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టారు. కాళ్లతో తన్నారు. నడిరోడ్డుపై ఇంతా జరుగుతున్నప్పటికీ, ఎవరూ పట్టించుకోలేదు. వాహనదారులు, ప్రయాణికులు ఎవరికి వారుగా ఏమీ పట్టనట్టుగానే చూసి చూడనట్టుగా వెళ్లిపోయారు.

Watch Cctv Footage: ఢిల్లీ వీధుల్లో దొంగల హల్‌చల్‌.. సినిమా రేంజ్‌లో దారి దోపిడీ.. వైరలవుతున్న వీడియో..
Delhi
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 17, 2023 | 6:11 PM

దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు తెగబడ్డారు. ఉత్తర ఢిల్లీలోని రూప్ నగర్ ప్రాంతంలో బైక్‌పై వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు 42 ఏళ్ల వ్యక్తిపై కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారు. రూప్‌ నగర్‌లోని శక్తినగర్‌లో రాత్రివేళ బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని దొంగలు బైకులతో ఢీకొట్టి లూటీకి పాల్పడ్డారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి హన్నీ కుమార్ కల్రా, అతని కుడి కాలుకు కాల్చి, అతని నుండి రూ. 5 లక్షలు కూడా దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. శక్తి నగర్‌లోని రూప్ నగర్ ప్రాంతంలో జనవరి 14న కీర్తి నగర్‌లోని ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ వ్యాపారి దుకాణంలో పనిచేస్తున్న కల్రా కస్టమర్ నుంచి డబ్బులు తీసుకుని తన మోటార్‌సైకిల్‌పై కార్యాలయానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైరల్‌ అవుతున్న సీసీ ఫుటేజ్‌ ప్రకారం.. బైకుపై వెళ్తున్న ఒక వ్యక్తిని రెండు బైకులపై నలుగురు దొంగలు వెంబడిస్తూ వచ్చారు. రద్దీ తక్కువగా ఉన్న ప్రదేశంలో అతడి బైకును ఢీకొట్టారు. బాధితుడు కిందపడగానే అతడి జేబులో నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశారు. అతడు ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టారు. కాళ్లతో తన్నారు. నడిరోడ్డుపై ఇంతా జరుగుతున్నప్పటికీ, ఎవరూ పట్టించుకోలేదు. వాహనదారులు, ప్రయాణికులు ఎవరికి వారుగా ఏమీ పట్టనట్టుగానే చూసి చూడనట్టుగా వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

కానీ, చివరికి ఒక కారులో ఉన్నవాళ్లు మాత్రం ధైర్యం చేసి కారును ఆపేశారు. కానీ, దుండగుల్లో ఒకడు కారు ఎందుకు ఆపారంటూ వాళ్లపై తుపాకీ ఎక్కుపెట్టి వారిని బెదిరించాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. ఇలా అతడు కారులో వాళ్లను బెదిరిస్తుండగానే మిగతా ముగ్గురు బాధితుడిని లూటీచేశారు. ఆ తర్వాత బాధితుడి ఎడమకాలుపై ఒక రౌండ్‌ కాల్పులు జరిపి నలుగురూ అక్కడి నుంచి ఉడాయించారు. జనవరి 14న రాత్రివేళ జరిగిన ఈ దారుణం అంతా అక్కడికి సీసీ కెమెరాలో రికార్డయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?