Health News: ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి…చాలా సార్లు ప్రాణాంతకం కావొచ్చు..

ప్రధాన లక్షణం పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి. నొప్పితో పాటు, అనేక ఇతర లక్షణాలు కూడా అనుభవిస్తారు. కడుపు నొప్పి భరించలేనంతగా మారినప్పుడు, అది..

Health News: ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి...చాలా సార్లు ప్రాణాంతకం కావొచ్చు..
Appendicitis
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 17, 2023 | 5:48 PM

చాలా మందికి అపెండిసైటిస్‌పై స్పష్టమైన అవగాహన ఉండదు. అపెండిక్స్ అనేది చిన్న సంచిలా ఉండే అవయవం. ఇది పెద్ద ప్రేగు పక్కన, దానికి అనుబంధంగా చివరలో వేలాడినట్టు ఉంటుంది. అపెండిసైటిస్ ప్రధాన లక్షణం పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి. నొప్పితో పాటు, అనేక ఇతర లక్షణాలు కూడా అనుభవిస్తారు. కడుపు నొప్పి భరించలేనంతగా మారినప్పుడు, అది అపెండిసైటిస్ లక్షణమని అనుమానించాలి. అయితే మన శరీరంలో అపెండిక్స్ లేకుండా కూడా జీవించగలదు. కాబట్టి దాన్ని తొలగిస్తుంటారు వైద్యులు. అపెండిసైటిస్‌లో మొదట నొప్పి నాభి చుట్టూ రావచ్చు. తర్వాత పొత్తికడుపు నుంచి పైకి వ్యాపిస్తుంది. ఉదరం, దిగువ కుడి వైపున నొక్కడం వలన తీవ్రమైన నొప్పి వస్తుంది. కడుపు నొప్పి అనేక ఇతర లక్షణాలతో కూడి ఉంటుంది. అపెండిసైటిస్ ఇతర లక్షణాలు వికారం, జ్వరం, ఆకలి లేకపోవడం, అలసట, మలబద్ధకం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి కూడా కావొచ్చు.

వృద్ధులు, గర్భిణీ స్త్రీలు వివిధ లక్షణాలు. ఎలాంటి లక్షణాలు కనిపించినా వైద్యుల సహాయం తీసుకోవాలి. వైద్యులు శరీరాన్ని పరీక్షించడం ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. ఇకపోతే, ఇలాంటి అపెండిసైటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి దీర్ఘకాలిక లక్షణాలతో సాగితే, మరొకటి తీవ్రంగా వస్తుంది. అపెండిసైటిస్ తీవ్రంగా మారితే అపెండిక్స్ పగిలిపోయే ప్రమాదం ఉంది. వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. సమస్య చిన్నదైతే యాంటీ బయోటిక్స్ ఇచ్చి చికిత్స చేస్తారు. తీవ్రమైనదైతే ఆ అవయవాన్ని తొలగిస్తారు.

మూత్రపిండాలు లేదా మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించుకోవడానికి యూరినాలిసిస్ చేయవచ్చు. ఇన్ఫెక్షన్ కోసం రక్త పరీక్ష కూడా చేయవచ్చు. అపెండిక్స్‌లో ఏదైనా అవరోధం ఉందో లేదో తెలుసుకోవడానికి ఉదరం ఎక్స్-రే తీసుకోవచ్చు. కణితులు లేదా ఇతర సమస్యల కోసం తనిఖీ చేయడానికి అల్ట్రాసౌండ్ లేదా CT స్కాన్ చేయవచ్చు. ప్రారంభంలోలోనే తెలుసుకున్నట్టయితే, మందుల సాయంతో వ్యాధి నయమవుతుంది. కొందరికి అపెండెక్టమీ అవసరం కావచ్చు. అపెండిసైటిస్‌ను నివారించడానికి నిర్దిష్ట మార్గం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..