AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మీరు సెలక్ట్ చేయకున్నా.. నా సెంచరీల వర్షం ఆగదు.. తొడగొట్టి, వేలు చూపిస్తూ.. బీసీసీఐకి స్ట్రాంగ్ వార్నింగ్?

Sarfaraz Kha: ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో తొలిరోజు సెంచరీ సాధించిన సర్ఫరాజ్.. ఆ తర్వాత తన రిథమ్‌తో చేసిన హావభావాలు చూస్తుంటే.. భారత సెలెక్టర్లకు గట్టిగా సందేశం ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది.

Video: మీరు సెలక్ట్ చేయకున్నా.. నా సెంచరీల వర్షం ఆగదు.. తొడగొట్టి, వేలు చూపిస్తూ.. బీసీసీఐకి స్ట్రాంగ్ వార్నింగ్?
Sarfaraz Khan
Venkata Chari
|

Updated on: Jan 17, 2023 | 8:16 PM

Share

Ranji Trophy: ఇటీవలే ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌ కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. అయితే, అంతా ఆశించినట్లుగా సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇస్తారని అనుకున్నా.. మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. దీంతో ఇక ఈ ప్లేయర్ దేశవాళీలకే పరిమితవ్వాలంటూ క్రికెట్ ప్రేమికులు కామెంట్లు చేస్తు్న్నారు. అయితే, బీసీసీఐ నుంచి పిలుపురాకపోతేనేం.. నా ఆటతో అందర్నీ మొప్పిస్తానంటూనే ఉన్నాడు. ఇప్పటికే వరుస సెంచరీలతో దేశవాళీలో సత్తా చాటిన సర్ఫరాజ్.. తాజాగా మరోసారి సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సెలక్టర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో తొలిరోజు సెంచరీ చేసిన సర్ఫరాజ్.. ఆ తర్వాత అతడి హావభావాలు చూస్తుంటే.. భారత సెలెక్టర్లు తమ తప్పును తెలుసుకునేలా చేస్తున్నాడనిపించింది. వారికి ఒక సందేశం ఇచ్చినట్లు చూడొచ్చు. మీరు నన్ను ఎంచుకున్నా, ఎంచుకోకపోయినా సెంచరీల వర్షం ఆగదనే చెప్పే ప్రయత్నం చేసినట్లు వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

సర్ఫరాజ్ అద్భుత ఇన్నింగ్స్‌కు కోచ్ సెల్యూట్..

అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులు చేశాడు. 155 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఈ పరుగులు సాధించాడు. టీమిండియా సెలక్టర్లు సర్ఫరాజ్‌ను పట్టించుకోకపోవడంతో అతని బ్యాట్‌ నుంచి ఈ సెంచరీకి ప్రాధాన్యత పెరిగింది. టీమిండియా టెస్టు జట్టులోకి ఎంపిక కాకపోవడంతో సర్ఫరాజ్‌ నిరాశకు గురయ్యాడు. ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీపై సెంచరీ చేసిన తర్వాత ముంబై కోచ్ అమోల్ మజుందార్ తన టోపీని తీసి అతనికి సెల్యూట్ చేయడం బహుశా ఇదే కారణం కావచ్చని అంటున్నారు.

కేవలం 25 ఇన్నింగ్స్‌ల్లోనే 10 సెంచరీలు..

ఢిల్లీపై సెంచరీ సర్ఫరాజ్ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 13వ సెంచరీగా నిలిచింది. అయితే, అతని గత 25 ఇన్నింగ్స్‌లను మాత్రమే పరిశీలిస్తే, అతను 10 సెంచరీలు సాధించాడు. దీన్నిబట్టి అతని ప్రస్తుత ఫాంత ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. అతను టీమిండియా టెస్టు జట్టులో ఎంపికయ్యేందుకు ఎందుకు అర్హుడో ఇట్టే చెప్పుకోవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ