Video: 7 సిక్స్‌లు, 5 ఫోర్లు.. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ ఇన్నింగ్స్.. టీ20లో దుమ్మురేపిన టెస్ట్ ప్లేయర్..
Sydney Sixers vs Adelaide Strikers: ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న స్టీవ్ స్మిత్.. బ్యాట్‌తో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో బౌలర్లపై భీకరమైన దాడి చేశాడు.
Big Bash League Viral Video: ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ టెస్టుల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్‌లో ఒకడిగా పేరుగాంచిన సంగతి తెలసిందే. ప్రస్తుతం స్మిత్ టీ20లో దుమ్మురేపుతున్నాడు. ఇటీవల కాలంలో టెస్ట్ ప్లేయర్‌గా పేరుగాంచిన స్మిత్.. తుఫాను సెంచరీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న స్టీవ్ స్మిత్.. బౌలర్లపై భీకరమైన దాడి చేశాడు. సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్‌పై తుఫాన్ బ్యాటింగ్‌తో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాడు.
స్టీవ్ స్మిత్ టీ20లో రెండో సెంచరీ..
ఈ మ్యాచ్‌లో తొలుత సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్ చేసింది. సాధారణంగా ఫస్ట్ డౌన్‌లో ఆడే స్టీవ్ స్మిత్ ఇక్కడ ఓపెనింగ్ చేసి అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్లను చిత్తు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ఆరంభం అంతగా బాగోలేదు. మొదటి వికెట్ కేవలం 3 పరుగుల వద్ద పడిపోయింది. కానీ, ఈ వికెట్ పడిన తర్వాత స్టీవ్ స్మిత్ బ్యాట్ మెరుపులు మెరిపించింది. మైదానంలోని నాలుగు మూలల్లో పరుగుల వర్షం కురిపించాడు. ఫలితంగా అతను అతి తక్కువ సమయంలో సెంచరీ పూర్తి చేశాడు. ఇది టీ20లో అతనికి రెండో సెంచరీగా నిలిచింది.
56 బంతుల్లో 101 పరుగులు.. 7 సిక్సర్లు, 5 ఫోర్లు..
Steve Smith, what a way to bring up your maiden #BBL ton! ?#BBL12 | @BKTtires | #GoldenMoment pic.twitter.com/iFOesNfeIJ
— cricket.com.au (@cricketcomau) January 17, 2023
అడిలైడ్ స్ట్రైకర్స్‌పై స్టీవ్ స్మిత్ కేవలం 56 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇందులో 12 బంతులను బౌండరీలు తరలించాడు. ఇందులో 7 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. భీకరమైన దశలో రనౌట్ అయ్యాడు.
తుఫాను సెంచరీతో హృదయాలను గెలిచిన స్మిత్..
స్టీవ్ స్మిత్ చేసిన ఈ తుఫాను టీ20 సెంచరీ ఫలితంగా సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనంతరం అడిలైడ్ స్ట్రైకర్స్‌కు 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి, 19 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా, ఓడిపోయినా, బిగ్ బాష్ లీగ్‌లో తన ప్రదర్శనతో స్టీవ్ స్మిత్ తన క్రికెట్ అభిమానుల హృదయాలను ఖచ్చితంగా గెలుచుకున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..