IND vs NZ: టీమిండియా నయా ‘సిక్సర్ కింగ్’.. ధోని రికార్డ్‌ను బ్రేక్ చేసేందుకు సిద్ధమైన హిట్‌మ్యాన్..
Rohit Sharma: న్యూజిలాండ్ సిరీస్‌లో మహేంద్ర సింగ్ ధోని సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టేందుకు భారత సారథి రోహిత్ సిద్ధమయ్యాడు. దీంతో టీమిండియా కొత్త సిక్సర్ కింగ్‌గా మారనున్నాడు.
IND Vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జనవరి 18 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టే గొప్ప అవకాశం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఉంది. ఈ వన్డే సిరీస్‌లో భారత్‌లో ఆడుతున్నప్పుడు, రోహిత్ ధోని రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించనున్నాడు.
ధోనీ రికార్డుపై కన్నేసిన రోహిత్..
భారత జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో భారీ రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి ఈ సిరీస్‌లో భారత్‌లో ఆడుతున్నప్పుడు అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును రోహిత్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా రోహిత్ ఈ రికార్డును సాధించగలడు. వన్డే ఫార్మాట్‌లో భారత గడ్డపై రోహిత్, మహేంద్ర సింగ్ ధోనీలు 123 సిక్సర్లు కొట్టారు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, రోహిత్ ఈ రికార్డును బద్దలు కొట్టవచ్చు. భారతదేశం తరపున కొత్త సిక్సర్ కింగ్‌గా మారేందుక సిద్ధమయ్యాడు.
భారత్‌లో 7000 పరుగులు పూర్తి చేసిన రోహిత్..
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంకతో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో మొత్తం 142 పరుగులు చేశాడు. దీంతో ఈ సిరీస్‌లో రోహిత్ భారతదేశంలో 7000 పరుగులను కూడా పూర్తి చేశాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రోహిత్ కంటే ముందు 7401 పరుగులు చేసి ఐదో స్థానంలో ఉన్నాడు. గాయం నుంచి తిరిగి జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. కాబట్టి ఈ ఏడాది ధోనీ రికార్డును బద్దలు కొట్టగలడని భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..