- Telugu News Photo Gallery Cricket photos Ind vs nz 1st odi team india probable playing 11 against new zealand suryakumar yadav ishan kishan
IND vs NZ 1st ODI Playing 11: టీమిండియా ప్లేయింగ్ XIపై తీవ్ర ఉత్కంఠ.. ఆ నలుగురిలో తొలి వన్డే ఆడే ఛాన్స్ ఎవరికో?
India vs New Zealand 1st ODI Hyderabad: జనవరి 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడం టీం మేనేజ్‌మెంట్‌కు అంత సులభం కావడం లేదు.
Updated on: Jan 17, 2023 | 5:49 PM

భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ కోసం రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ జనవరి 18న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడం భారత్‌కు అంత సులువు కాదు. ఎందుకంటే ప్రస్తుతం చర్చ అంతా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌ల గురించే జరుగుతోంది.

ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నారు. బాగా రాణిస్తున్నారు. అదే సమయంలో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ విషయంలో కూడా సమస్య ఉండవచ్చు. ఈసారి ప్లేయింగ్ XIని ఎంపిక చేయడం సెలక్టర్లకు అంత సులువు కాదనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారత జట్టు ప్రపంచ కప్ 2023 కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఈ కోణంలో న్యూజిలాండ్‌తో సిరీస్ ఎంతో కీలకంగా మారింది. ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌పై ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 126 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. అయితే ఇంత జరిగినా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అతనికి అవకాశం రాకపోవడం గమనార్హం.

ఇషాన్ కిషన్ స్థానంలో శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌కు వచ్చాడు. మరి ఇప్పుడు వికెట్‌కీపర్‌గా ఇషాన్ రంగంలోకి దిగుతాడా లేదా అనేది చూడాల్సి ఉంది. సూర్యకుమార్‌తో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు. రాజ్‌కోట్ టీ20లో సూర్య సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.


చాహల్ రాజ్‌కోట్‌లో 2 వికెట్లు, పుణెలో ఒక వికెట్ తీశాడు. ఈ రెండూ టీ20 మ్యాచ్‌లే. వన్డేల్లో ఒక వికెట్ పడగొట్టాడు. ఇంతకు ముందు కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్/శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్/మహమ్మద్ షమీ మరియు కుల్దీప్ యాదవ్.

న్యూజిలాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కీపర్&కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్/హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధీ మరియు డౌగ్ బ్రేస్‌వెల్.





























