- Telugu News Photo Gallery Cricket photos Ind vs nz shubman gill century vs new zealand 1st odi hyderabad Third ODI century in 19 ODI innings for Shubman Gill
IND vs NZ: హైదరాబాద్‌లో ‘గిల్’ మెరుపులు.. సెంచరీతో కోహ్లీ, ధావన్ రికార్డులకు బ్రేక్.. తొలి టీమిండియా ప్లేయర్‌గా..
Shubman Gill Century: శుభ్‌మన్ గిల్ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించాడు.
Updated on: Jan 18, 2023 | 4:09 PM

తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూనే టీమిండియా యువ స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ మరో సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ తన వన్డే కెరీర్‌లో మూడో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

అయితే కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే శుభ్‌మన్ గిల్ వెయ్యి పరుగులు పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. అంటే కింగ్ కోహ్లి కంటే గిల్ 5 ఇన్నింగ్స్ తక్కువలోనే ఈ ఘనత సాధించాడు.

మూడు రోజుల క్రితం తిరువనంతపురంలో శ్రీలంకపై సెంచరీతో సత్తా చాటిన గిల్.. జనవరి 18న హైదరాబాద్‌లో కివీస్ బౌలర్లపై అదే ఫాంను కొనసాగించాడు. వరుసగా రెండో వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

గిల్ తన వన్డే కెరీర్‌లో మూడో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. దీంతో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ రికార్డులను గిల్ వదిలేశాడు.

శుభ్‌మన్ గిల్ ఈ ఇన్నింగ్స్‌లో 106 పరుగులు చేసిన వెంటనే వన్డే క్రికెట్‌లో 1000 వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

గిల్ 19 వన్డేల్లో 19 ఇన్నింగ్స్‌ల్లో 1000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ పేరిట ఉండేది.

విరాట్ 27 మ్యాచ్‌ల్లో 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించగా, ధావన్ 24 మ్యాచ్‌ల్లో 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించాడు.





























