IND vs NZ ODI Head to Head Records: 113 వన్డేల్లో తలపడిన భారత్, న్యూజిలాండ్.. పైచేయి ఎవరిదంటే?

IND vs NZ ODI Records: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 113 వన్డేలు జరిగాయి. ఇందులో టీమిండియా 55 మ్యాచ్‌లు గెలవగా, న్యూజిలాండ్ 50 మ్యాచ్‌లు గెలిచింది.

IND vs NZ ODI Head to Head Records: 113 వన్డేల్లో తలపడిన భారత్, న్యూజిలాండ్.. పైచేయి ఎవరిదంటే?
Rohit Sharma Ind Vs Nz
Follow us
Venkata Chari

|

Updated on: Jan 18, 2023 | 6:10 AM

IND vs NZ ODI Head to Head Records: న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 18, బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. న్యూజిలాండ్ ప్రస్తుతం నంబర్ వన్ వన్డే జట్టుగా ఉంది. కాబట్టి ఈ సిరీస్‌ను గెలవడం భారత్‌కు అంత సులువు కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇరుజట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన వన్డేల్లో పైచేయి ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డేల రికార్డులు..

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 113 వన్డేలు జరిగాయి. ఇందులో భారత జట్టు 55 మ్యాచ్‌లు గెలవగా, న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇది కాకుండా, 7 మ్యాచ్‌లలో ఎటువంటి ఫలితం తేలలేదు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. గణాంకాల ప్రకారం, విజయాల్లో భారత జట్టు న్యూజిలాండ్ కంటే ముందుంది. టీమిండియా ఇప్పటి వరకు 52.35 శాతం విజయం సాధించింది. అలాగే న్యూజిలాండ్ 47.64 శాతం మ్యాచ్‌లను గెలుచుకుంది.

అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్స్..

ఇరుజట్ల మధ్య జరిగిన వన్డేల్లో భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు చేసిన లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు. లిటిల్ మాస్టర్ 41 మ్యాచ్‌లలో 41 ఇన్నింగ్స్‌లలో 46.05 సగటుతో 1750 పరుగులు చేశాడు. ఇందులో సచిన్ అత్యధిక స్కోరు 186* పరుగులుగా నిలిచింది. ఏ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. సచిన్ బ్యాట్ నుంచి 5 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు..

ఇరుజట్ల మధ్య జరిగిన వన్డేల్లో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జగ్వాల్ శ్రీనాథ్ అత్యధికంగా 51 వికెట్లు పడగొట్టాడు. అతను 30 మ్యాచ్‌ల్లో 20.41 సగటుతో ఈ వికెట్లు తీశాడు.

అత్యధిక సెంచరీలు, అర్ధశతకాలు..

వీరేంద్ర సెహ్వాగ్ రెండు జట్ల మధ్య అత్యధికంగా 6 సెంచరీలు చేశాడు. మరోవైపు అత్యధిక సార్లు 50 పరుగుల సంఖ్యను దాటిన వారిలో విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. విరాట్ ఈ సంఖ్యను 13 సార్లు దాటాడు.

మొదటి సెంచరీ..

రెండు జట్ల మధ్య జరిగిన వన్డే క్రికెట్‌లో మొదటి సెంచరీని గ్లెన్ టర్నర్ జూన్ 14, 1975న మాంచెస్టర్‌లో నమోదు చేశాడు. 117 బంతుల్లో 114 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు.

వికెట్ కీపింగ్ రికార్డులు..

ఇరుజట్ల మధ్య జరిగిన వన్డేల్లో భారత వికెట్ కీపర్ నయన్ మోంగియా స్టంప్స్ వెనుక నుంచి అత్యధికంగా 36 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఇందులో 24 క్యాచ్‌లు, 12 స్టంపింగ్‌లు ఉన్నాయి. అలాగే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 33 ఔట్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఫీల్డింగ్ రికార్డులు..

న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ రెండు జట్ల మధ్య వన్డేల్లో అత్యధికంగా 19 క్యాచ్‌లు అందుకున్నాడు. 35 మ్యాచ్‌ల్లో ఈ క్యాచ్‌లు అందుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..