ప్రేమ వద్దన్నారు.. ప్రాణాలు పోయాక విగ్రహాలకు పెళ్లి చేశారు.. ముందే మేల్కొని ఉంటే..

గ్రామంలో రెండు కుటుంబాలు కలిసి గణేష్, రంజన విగ్రహలను స్థానిక బస్టాండ్‌ సమీపంలో తయారు చేయించారు. ఈ జంట ఆత్మహత్య చేసుకున్న ఆరు నెలల తర్వాత వారి కుటుంబ పెద్ద‌లు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా విగ్ర‌హాల‌కు వివాహం జ‌రిపించారు.

ప్రేమ వద్దన్నారు.. ప్రాణాలు పోయాక విగ్రహాలకు పెళ్లి చేశారు.. ముందే మేల్కొని ఉంటే..
Lovers Die
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 18, 2023 | 5:10 PM

ఇదో ఆశ్చర్యకర సంఘటన..రెండు విగ్రహాలకు వివాహం చేశారు పెద్దలు. గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకోగా,… వారి ప్రతిమలను తయారు చేసి ఇప్పుడా విగ్రహాలకు వివాహం చేశారు ఇరుకుటుంబాల పెద్దలు. ఈ విచిత్ర వెడ్డింగ్ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ విచిత్ర వివాహ వేడుకకు వేదికైంది గుజరాత్‌లోని థాపీ ప్రాంతం. స్థానికంగా నివసిస్తున్న గణేష్‌, రంజన ఇద్దరు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయమై ఇద్దరి తల్లిదండ్రులకు చెప్పి అంగీకరించే ప్రయత్నం చేశారు. కానీ, వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇక పెళ్లి జరగదని, త‌మ కుటుంబ స‌భ్యులు పెళ్లికి అంగీక‌రించ‌ర‌ని తేలిపోవ‌డంతో ప్రేమికులిద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. జరిగిన సంఘటన అప్పట్లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

గత ఏడాది ఆగ‌స్ట్‌లో థాపీ ప్రాంతానికి చెందిన గ‌ణేష్‌, రంజ‌న తాడుకు వేలాడుతూ విగ‌త‌జీవులుగా ప‌డిఉండ‌టాన్ని వారి కుటుంబ‌స‌భ్యులు గుర్తించారు. ఆ తర్వాత వారిలో పశ్చాత్తాపం మొదలైంది. తమ పిల్లల ప్రేమను అర్థం చేసుకోలేకపోయామని, తమ కారణంగా ప్రాణాలు విడిచిపెట్టారని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తర్వాత ఇరు కుటుంబాల వైఖరిలో ఆశ్చర్యకరమైన మార్పు వచ్చింది. గణేశ్‌, రంజన కుటుంబ సభ్యులు ఒక్కటయ్యారు. వారంతా తమ తప్పుతెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ పిల్లల కోసం తపించిపోయారు. ఈ క్రమంలోనే వారు ఓ అపూర్వమైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో రెండు కుటుంబాలు కలిసి గణేష్, రంజన విగ్రహలను స్థానిక బస్టాండ్‌ సమీపంలో తయారు చేయించారు. ఈ జంట ఆత్మహత్య చేసుకున్న ఆరు నెలల తర్వాత వారి కుటుంబ పెద్ద‌లు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా విగ్ర‌హాల‌కు వివాహం జ‌రిపించారు.

ఇద్దరూ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకోవడం చూశాం. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కోరికలు తీర్చేందుకే ఇలా చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కోరిక‌ను తాము ఇలా మ‌న్నించ‌డంతో వారి ఆత్మ‌ల‌కు శాంతి చేకూరుతుంద‌ని న‌మ్ముతున్నామ‌ని ఇరు కుటుంబాల వారు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..