AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhilesh Yadav: కేసీఆర్ పనిచేస్తారు.. ప్రచారం చేసుకోరు.. మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందంటూ యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. విమర్శించే నాయకులపై ఢిల్లీ ప్రభుత్వం దాడి చేస్తోందంటూ విమర్శించారు.

Akhilesh Yadav: కేసీఆర్ పనిచేస్తారు.. ప్రచారం చేసుకోరు.. మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు..
Akhilesh Yadav
Shaik Madar Saheb
|

Updated on: Jan 18, 2023 | 4:47 PM

Share

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందంటూ యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. విమర్శించే నాయకులపై ఢిల్లీ ప్రభుత్వం దాడి చేస్తోందంటూ విమర్శించారు. ఖమ్మం బీఆర్ఎస్ సభలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత పెద్ద సభను తానెప్పుడు చూడలేదని పేర్కొన్నారు. ఇక్కడి కలెక్టరేట్లు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభమైందన్నారు.

విపక్ష పార్టీల నేతలను బీజేపీ కేసుల పేరుతో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ అఖిలేష్ పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలను చూపి భయపెట్టాలని చూస్తోందన్నారు. నిన్న ముగిసిన బీజేపీ జాతీయ సమావేశాల్లో ప్రధాని మోదీ మాటలు విన్నాం. మోదీ ఇక 400 రోజులే మిగిలివుందంటున్నారు. అంటే కేంద్రం రోజులు లెక్కబెట్టుకుంటోందన్నారు. ఇవాళ్టితో కేంద్రానికి ఇక 399 రోజులే ఉందన్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థల్లా మారిపోయాయని.. మోదీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ షురూ అయిందని పేర్కొన్నారు.

రైతుల ఆదాయం కాదు.. వ్యయాన్ని రెట్టింపు చేశారంటూ మండిపడ్డారు. యూపీలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. G-20 అధ్యక్ష పదవిని కూడా ప్రచారానికి వాడుకుంటుని మండిపడ్డారు. తెలంగాణలో BJPని కేసీఆర్ ఓడించాలి.. యూపీలో ఆ పని మేం చేస్తాం అంటూ అఖిలేష్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

గంగానదిలో క్రూయిజ్‌ షిప్‌తో పేదలకు లాభమేంటని ప్రశ్నించారు. నదిలో కాలుష్యం మాత్రం అలాగే ఉంది. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందంటూ వివరించారు. ఇంటింటికి నల్లా, వ్యవసాయ పథకాలను.. కేంద్రం తెలంగాణను చూసే నేర్చుకుందన్నారు. యాదాద్రిని అద్భుతంగా నిర్మించిన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. కేసీఆర్ అందరిలా కాదని.. పనిచేస్తారు.. ప్రచారం చేసుకోరంటూ కొనియాడారు. భ్రమల్లో ఉంచి గెలవడం బీజేపీకి వెన్నతోపెట్టిన విద్య అని.. కానీ ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారంటూ అఖిలేష్ పేర్కొన్నారు.