Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: సంసారం సజావుగా సాగాలంటే.. ఈ విషయాలపై లుక్కెయండి.. లేకపోతే వైవాహిక జీవితం..

కలకాలం విడదీయరాని బంధం వివాహబంధం.. జీవితంలో వివాహబంధం విశిష్టత, ప్రాధాన్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కానీ ప్రస్తుత వాతావరణంలో దానిని కాపాడుకోవడం కష్టంగా మారింది.

Relationship Tips: సంసారం సజావుగా సాగాలంటే.. ఈ విషయాలపై లుక్కెయండి.. లేకపోతే వైవాహిక జీవితం..
జీవనశైలి: లైంగిక జీవితం ఆరోగ్యకరంగా ఉండేందుకు నిపుణులు జీవనశైలిలో మార్పులు ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి పురుషులు, మహిళలు ఇద్దరికీ కొన్ని పరిశుభ్రత చిట్కాలను సూచిస్తున్నారు. వాటిని క్రమం తప్పకుండా అవలంభిస్తే.. లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడంతోపాటు.. ఆనందమయంగా జీవించవచ్చని పేర్కొంటున్నారు.
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 17, 2023 | 7:32 PM

కలకాలం విడదీయరాని బంధం వివాహబంధం.. జీవితంలో వివాహబంధం విశిష్టత, ప్రాధాన్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కానీ ప్రస్తుత వాతావరణంలో దానిని కాపాడుకోవడం కష్టంగా మారింది. ప్రముఖులతో పాటు.. సమాన్యులు సైతం వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్న సంఘటనలు ఎన్నో తెరపైకి వస్తున్నాయి. జీవితంలో అత్యంత ముఖ్యమైన బంధాన్ని తెగదెంపులు చేసుకోవడం సర్వసాధారణంగా మారుతోంది. ఇది ఎన్నో కుటుంబాల్లో ఆందోళనకు గురిచేస్తోంది. వైవాహిక జీవితంలో కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే పెద్ద ఇబ్బందులకు కారణం అవుతాయి. సంబంధం ఎప్పటికి ముగింపు దశకు చేరుకుంటుందో తెలియడం లేదు. ఇలాంటి క్రమంలో పెళ్లి తర్వాత జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వైవాహిక జీవితం నాశనం అవుతుందని పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శారీరక సంబంధం..

సంబంధం గడిచిన కొద్ది శారీరక సంబంధం లేదా దంపతుల మధ్య సాన్నిహిత్యం తగ్గడం సాధారణం. సమయం గడిచేకొద్దీ, సంబంధంలో క్షీణిస్తున్న పరిస్థితుల కారణంగా వ్యక్తుల లైంగిక జీవితం చెదిరిపోతూ ఉంటుంది. సెక్స్ లైఫ్ బోరింగ్ కారణంగా, సంబంధం కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థికి రావొచ్చు. అయితే, సంబంధాన్ని బలోపేతం చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. కలిసి సెలవులకు వెళ్లడం లేదా కలిసి సమయాన్ని గడపడం ద్వారా ఒకరినొకరు మళ్లీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.

ఒకరినొకరు తోడు నిలవాలి..

వైవాహిక జీవితంలో లేదా ప్రేమ సంబంధంలో సమయం గడిచేకొద్దీ, జంట మానసికంగా జత అవుతారు. వారి మధ్య అంచనాలు సైతం పెరుగుతాయి. కానీ చాలా మంది తమ.. తమ భాగస్వామి మధ్య గొడవలు వచ్చినప్పుడు ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో సపోర్ట్ గా ఉండకపోవడమే పెద్ద తప్పు. ప్రజలు కోపంలో తమ భాగస్వామితో మానసికంగా ఉండకపోవడం వంటి ప్రవర్తనను అలవర్చుకుంటారు. ఈ ప్రవర్తనకు బదులుగా భాగస్వామికి మద్దతుగా ఉండటం.. వారితో మాట్లాడటం లాంటివి చేయాలి.

ఇవి కూడా చదవండి

పని భారం.. జీవితం..

ఉద్యోగం, పనికి సంబంధించిన బాధ్యతలు సాధారణంగా ప్రతి ఒక్కరిపై ఉంటాయి. కానీ దాని ఒత్తిడిలో సంబంధాన్ని విస్మరించడం ఒక రకమైన పెద్ద తప్పు. పని జీవితంతో పాటు, వ్యక్తిగత జీవితాన్ని కూడా సమతుల్యం చేసుకోవడం తెలివైనదిగా పరిగణిస్తారు. వ్యక్తులు తమ పని జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని అర్ధం చేసుకుని.. పలు విషయాలను ఆచరించడం ద్వారా వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. కానీ.. ఈ విషయాలను విస్మరిస్తే.. వైవాహిక జీవితాన్ని నాశనం అవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం..