AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆత్మహత్యకు యత్నించిన యువతి.. అరచేతిపై పెళ్లి తేదీ, మరణ తేదీ రాసుకుని..

బాధిత యువతి వయసు 21 సంవత్సరాలు. 8 నెలల క్రితం ఆయుష్ గోయల్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. సోమవారం రాత్రి ఏం జరిగిందో తెలియదు గానీ, ఆత్మహత్యకు యత్నించింది.

ఆత్మహత్యకు యత్నించిన యువతి.. అరచేతిపై పెళ్లి తేదీ, మరణ తేదీ రాసుకుని..
Woman Tried To Commit Suici
Jyothi Gadda
|

Updated on: Jan 18, 2023 | 8:34 PM

Share

ఉజ్జయినిలోని రామినగర్‌లో అద్దె ఇంట్లో భర్తతో కలిసి ఉంటున్న యువతి.. కుటుంబంలో కలహాలు, మనస్పర్థలు రావడంతో ఆత్మహత్యకు యత్నించింది. ఆమె సోదరుడు సకాలంలో చేరుకుని ఆమెను రక్షించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలు తన అరచేతిపై మెహందీతో పెళ్లి తేదీని రాసి, చివరి తేదీ 16 జనవరి 2023 అని రాసి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నారు. అయితే, బాధిత యువతి ఇంకా స్టేట్‌మెంట్ ఇచ్చే స్థితిలో లేదు.

బాధిత యువతి వయసు 21 సంవత్సరాలు. 8 నెలల క్రితం ఆయుష్ గోయల్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. సోమవారం రాత్రి ఏం జరిగిందో తెలియదు గానీ, ఆత్మహత్యకు యత్నించింది. వారి ఇంటికి సమీపంలోనే ఉంటున్న తన సోదరుడికి విషయం తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను రక్షించి జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలి భర్త పూజారిగా పనిచేస్తున్నాడని, ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని ఆమె సోదరుడు చెప్పాడు. బాధితురాలు ఒకరోజు క్రితం ఆయుష్‌కు మొబైల్‌లో వాయిస్‌ సందేశం పంపింది. అందులో, నన్ను కలవడానికి రండి లేదా నేను చనిపోతాను అని చెప్పింది. ఆయుష్ ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అరచేతిపై పెళ్లి తేదీ రాసి, చివరి తేదీ 16 జనవరి 23 అని రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత గానీ, అసలు విషయం ఏంటి..? అనేది తెలుస్తుంది. మహిళ వాంగ్మూలం అనంతరం పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..