Teacher Love Story: టీచరమ్మ పాడుపని.. ట్యూషన్ అంటూ పిలిచింది.. చివరకు 16 ఏళ్ల పిల్లాడితో కలిసి..

ఆ టీచర్‌కి ప్రేమ జ్వరం వచ్చింది.. ఇంకెముంది.. విద్యాబుద్ధులు నేర్పించేది పోయి.. పిల్లాడికి కామబుద్దులు నేర్పించింది. ఇంటి ముందు ఉండే ఓ బాలుడితో గుట్టుగా ప్రేమాయణం కొనసాగించింది.

Teacher Love Story: టీచరమ్మ పాడుపని.. ట్యూషన్ అంటూ పిలిచింది.. చివరకు 16 ఏళ్ల పిల్లాడితో కలిసి..
Teacher Love Story
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 18, 2023 | 8:11 PM

Teacher Student Love Story: ఆ టీచర్‌కి ప్రేమ జ్వరం వచ్చింది.. ఇంకెముంది.. విద్యాబుద్ధులు నేర్పించేది పోయి.. పిల్లాడికి కామబుద్దులు నేర్పించింది. ఇంటి ముందు ఉండే ఓ బాలుడితో గుట్టుగా ప్రేమాయణం కొనసాగించింది. చివరకు ఎలాగైనా ఆ బాలుడిని దక్కించుకోవాలని టీచర్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఉన్నట్టుండి ఆ బాలుడితో కలిసి బిచాణా ఎత్తేసింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఈ షాకింగ్ ప్రేమ ఘటన.. యూపీలోని నోయిడా నగరంలో చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడితో ప్రేమాయణం కొనసాగించిన టీచర్‌.. 16 ఏళ్ల మైనర్ విద్యార్థి (బాలుడు) తో పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థి తండ్రి సెక్టార్ 113 పోలీస్ స్టేషన్‌లో ఉపాధ్యాయురాలిపై కేసు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. నోయిడాలోని సెక్టార్ 123లో నివసిస్తున్న 22 ఏళ్ల టీచర్ ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెబుతుండేది. ఈ క్రమంలో టీచర్ ఇంటి ముందు 16 ఏళ్ల బాలుడు నివసిస్తున్నాడు. మైనర్‌ బాలుడు టీచర్‌ వద్దకు చదువుకునేందుకు ఎప్పుడూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం మొదలుపెట్టారు. ఘాటైన ప్రేమలో మునిగితేలుతున్న ఇద్దరూ (టీచర్, స్టూడెంట్).. ఆదివారం ఇంటి నుంచి పారిపోయినట్లు బాలుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలుడి తండ్రి స్వస్థలం డియోరియా అని.. తన 16 ఏళ్ల కుమారుడు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో అత్త ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడని, సాయంత్రం వరకు తిరిగి రాలేదని బాలుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఉపాధ్యాయురాలిపై కేసు..

తమ ఇంటి ఎదురుగా నివసిస్తున్న 22 ఏళ్ల యువతి.. ట్యూషన్ చెబుతుందని.. అక్కడికి తమ కొడుకు వెళ్తాడని తండ్రి పోలీసులకు చెప్పాడు. ఆమె తన కొడుకును తీసుకుని వెళ్లిపోయిందని ఫిర్యాదులో వివరించాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు టీచర్‌పై కేసు నమోదు చేశారు. పలు కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయమై అడిషనల్ డీసీపీ అశుతోష్ ద్వివేది మాట్లాడుతూ.. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, యువతి బాలుడిని తీసుకుని వెళ్లినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ప్రేమ వ్యవహారం కూడా తెరపైకి వచ్చిందని.. త్వరలోనే ఇద్దరినీ పట్టుకుంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..