AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60 మంది ఇంటర్‌ అమ్మాయిలు.. 17 కిలోమీటర్లు అర్థరాత్రి నడుచుకుంటూ వెళ్లి వార్డెన్‌పై ఫిర్యాదు చేశారు..!

విద్యార్థుల సమస్యలను సానుకూలంగా తెలుసుకున్న కలెక్టర్ కార్యాలయ అధికారులు.. అనంతరం వారిని వాహనాల్లో తిరిగి పాఠశాలకు పంపించారు. దీనిపై విచారణ జరిపి వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని బాలికలకు హామీ ఇచ్చారు.

60 మంది ఇంటర్‌ అమ్మాయిలు.. 17 కిలోమీటర్లు అర్థరాత్రి నడుచుకుంటూ వెళ్లి వార్డెన్‌పై ఫిర్యాదు చేశారు..!
Jharkhand
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 18, 2023 | 6:13 PM

60 మందికి పైగా యుక్తవయస్సులో ఉన్న బాలికలు అర్ధరాత్రి రోడ్డెక్కారు. తమ రెసిడెన్షియల్ పాఠశాల నుండి బయటకు వచ్చి రాత్రిపూట నిర్జన రహదారుల గుండా 17 కిలోమీటర్లు నడిచి వెళ్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ఆశ్రయించి.. తమ గోడు విన్నవించారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్న విద్యార్థినులు.. తమ హాస్టల్ వార్డెన్ చేసిన దౌర్జన్యాల గురించి డిప్యూటీ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. ఖుంట్‌పానిలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 11వ తరగతి విద్యార్థినులు డిప్యూటీ కమిషనర్ అనన్య మిట్టల్‌కు ఫిర్యాదు చేసేందుకు చైబాసాలోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

తామంతా పాడైపోయిన ఆహారం తినాల్సి వస్తోందని, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, గదుల్లో విద్యార్థులు చలికి వణికిపోతున్నారని,సరైన మంచాలు, బెడ్లు లేక నేలపై పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా నిరసన తెలిపితే వార్డెన్‌ తమను తీవ్రంగా కొట్టారని విద్యార్థులు డీఎస్‌ఈకి ఫిర్యాదు చేశారు. తనిఖీ కోసం పాఠశాలకు వచ్చినప్పుడు వార్డెన్ సీనియర్ అధికారులతో అబద్ధాలు చెప్పమని విద్యార్థులను బలవంతం చేశారని వారు ఆరోపించారు.

చైబాసా చేరుకున్న తర్వాత, బాలికలు స్థానిక కాంగ్రెస్ ఎంపీ గీతా కోడాకు డయల్ చేశారు. వారు బాలికల చర్య గురించి DCకి తెలియజేశారు. అనంతరం డీసీ ఈ విషయాన్ని పరిశీలించాలని డీఎస్‌ఈని కోరారు. ఈ ఆరోపణలపై విచారణకు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తామని షీల్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

విద్యార్థినులు చేసిన ఈ పనితో జిల్లా విద్యాశాఖ అధికారుల్లో కలకలం రేపింది. డీసీ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ (డీఎస్‌ఈ) అభయ్‌కుమార్‌ షిల్‌ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల సమస్యలను సానుకూలంగా తెలుసుకున్నారు. అనంతరం వారిని వాహనాల్లో తిరిగి పాఠశాలకు పంపించారు. దీనిపై విచారణ జరిపి వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని బాలికలకు హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…