Arvind Kejriwal: గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు.. బీఆర్ఎస్ సభలో సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ మాకు పెద్దన్న లాంటి వారు.. కంటివెలుగు కార్యక్రమం ద్వారా తాము చాలా నేర్చుకున్నామని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు.
కేసీఆర్ మాకు పెద్దన్న లాంటి వారు.. కంటివెలుగు కార్యక్రమం ద్వారా తాము చాలా నేర్చుకున్నామని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. పంజాబ్‌లోనూ ఈ క్రమాన్ని చేపడతామని తెలిపారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణం ఒక అద్భుతంగా ఉన్నాయంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని కొనియాడారు. ఖమ్మం బీఆర్ఎస్ సభలో పాల్గొన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడం ఎలా.. రైతులకు, కార్మికులకు ఏం చేస్తుందనే దానిపై తామంతా కలిసి చర్చించామని తెలిపారు. కేరళలో విద్యాసంస్థలు అద్భుతంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితి దేశంలో ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందంటూ కేజ్రీవాల్ విమర్శించారు.
తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని.. వారంతా కేంద్రానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. అభివృద్ధి పనులకు అడ్గుతగలడమే పనిగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నార. గవర్నర్లు కేవలం కీలు బొమ్మలుగా మారి.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.