Diabetes Control: ఈ ఐదు ఆకుల రసాన్ని పరగడుపునే సేవించినట్టయితే.. మీ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది..
మధుమేహాన్ని నియంత్రించడానికి మరో చిట్కా కూడా అందుబాటులో ఉంది. ప్రకృతిలో దొరికే కొన్ని ఆకులు, ఆకుకూరలు మధుమేహ నియంత్రణకు బాగా ఉపకరిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మన దేశంలో మధుమేహం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కేవలం వృద్ధులకే పరిమితం కావడం లేదు. 30 ఏళ్ల వయసు వారిలోనూ విస్తరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) లెక్కల ప్రకారం మన దేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 77 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అలాగే మరో 25 మిలియన్ల మంది ప్రీ డయాబెటిస్ తో ఇబ్బందులు పడుతున్నారు. దీనిని సాధారణ రోగంలా అలా వదిలేయడానికి లేదు. రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోకపోతే దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలు కూడా పాడయ్యే ప్రమాదం పొంచి ఉంది. చివరికి ప్రాణాలను కూడా హరిస్తుంది. ఇది జీవన శైలి వ్యాధి కనుక ఒక్కసారి వచ్చిందంటే శాశ్వతంగా తొలగించలేం. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ అదుపులో ఉంచుకోవడమే శరణ్యం. అందుకోసం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, మందులు సక్రమంగా వాడటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అత్యవసరం. అయితే దీనిని నియంత్రించడానికి మరో చిట్కా కూడా అందుబాటులో ఉంది. ప్రకృతిలో దొరికే కొన్ని ఆకులు, ఆకుకూరలు మధుమేహ నియంత్రణకు బాగా ఉపకరిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..
కరివేపాకులు.. ఇవి రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడంలో బాగా ఉపకరిస్తాయి. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. అలాగే ఇన్సులిన్‌ను పెంచడానికి కూడా ఉపకరిస్తుంది.
తులసి ఆకులు.. ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన ఔషధంగా తులసిని పిలుస్తారు. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో తులసి ఆకుల రసం చాలా సహాయపడుతుంది. దీని కోసం తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, చల్లార్చి తాగాలి.
ఇన్సులిన్ ప్లాంట్ (కాస్టస్ ఇగ్నియస్).. ఈ మొక్క ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
మామిడి ఆకులు.. వీటిలో మాంగిఫెరిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆల్ఫా గ్లూకోసిడేస్‌ను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఇది జీర్ణప్రక్రియిను నియంత్రిస్తుతంది. తద్వారా రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. అలాగే మామిడి ఆకులు ఇన్సులిన్‌ని పెంచి గ్లూకోజ్‌ని నియంత్రించే శక్తి ఉంది. ఈ ఆకులలో పెక్టిన్, విటమిన్ సి , ఫైబర్ కూడా ఉంటాయి.
జామ ఆకులు.. జామ ఆకు రసం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. జామ ఆకు రసం ఆల్ఫా-గ్లూకోసిడేస్ అనే ఎంజైమ్ చర్యను నిరోధించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. జామ ఆకులను వేడి నీటిలో మరిగించి టీ లాగా తాగవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..