Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asafoetida with Milk: పురుషుల పాలిట దివ్యౌషధం ఇంగువ.. పాలతో కలిపి తీసుకుంటే అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు

ఇంగువ తీసుకోవడం పురుషులకు అనేక విధాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ముఖ్యంగా పురుషులు పాలలో దేశీ నెయ్యి, ఇంగువ కలిపి తాగడం వల్ల అనేక సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 

Asafoetida with Milk: పురుషుల పాలిట దివ్యౌషధం ఇంగువ.. పాలతో కలిపి తీసుకుంటే అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు
Asafoetida With Milk Benefits
Follow us
Surya Kala

|

Updated on: Jan 19, 2023 | 4:05 PM

నేటి కాలంతో మనిషి కాలంతో పోటీపడుతూ పరుగులు పెడుతూ జీవిస్తున్నాడు. మారుతున్న కాలంలో మారిన జీవన శైలి.. తగ్గిన శారీరక శ్రమతో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పురుషులలో సత్తువ తగ్గిపోతోంది. ఇంకా చెప్పాలంటే.. జెంట్స్ లో  కేవలం స్టామినా మాత్రమే కాదు.. జీర్ణక్రియ, బాన పొట్ట, పైల్స్ వంటి అనేక సమస్యల బారిన పడుతున్నారు. శారీరక బలహీనత కారణంగా, పురుషులు అప్పుడప్పుడు కండరాలలో నొప్పి, బద్ధకం అనుభూతి చెందుతారు. అటువంటి పరిస్థితిలో.. ఇంగువ తీసుకోవడం పురుషులకు అనేక విధాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ముఖ్యంగా పురుషులు పాలలో దేశీ నెయ్యి, ఇంగువ కలిపి తాగడం వల్ల అనేక సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

శక్తిని పెంచడంలో సహాయపడుతుంది పాలు, దేశీ నెయ్యి, ఇంగువ కలిపి పురుషులు తాగడం వలన తక్షణ శక్తినిస్తుంది.  పాలలో ఉన్న  ప్రొటీన్లు..  నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు శక్తిని పెంచుతుఉంది. ఇంగువ కండరాలకు బలాన్ని ఇస్తుంది. అలాగే, నెయ్యి తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.  పురుషులలో శారీరక బలహీనతను తొలగించి శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

పురుషులలో పైల్స్ కు చికిత్స నిరంతరం కూర్చోవడం.. లేదా ఎక్కువసేపు విధులను నిర్వహించే పురుషుల్లో ఎక్కువమందిని ఫైల్స్ బారిన పడతారు. కనుక మలం గట్టిపడకుండా నిరోధించడం అత్యవసరం. ఇలాంటి పరిస్థితుల్లో దేశీ నెయ్యి, ఇంగువ కలిపిన పాలు తాగడం వల్ల పైల్స్ సమస్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇంగువ ఎల్లప్పుడూ శరీరంలో వాత, పిత్త , కఫాలను సమతుల్యం చేస్తుంది. ఇంగువ తీసుకోవడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పాలు శరీరంలో అగ్ని మూలకాన్ని ప్రోత్సహిస్తుంది.. దీంతో జీర్ణవ్యవస్థను వేగవంతం అవుతుంది. అంతేకాదు  అజీర్ణం, అసిడిటీని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కండరాలకు బలాన్ని ఇస్తుంది వృద్ధాప్యం బారిన పడే పురుషుల శరీరంలో కాల్షియం లోపం కూడా ప్రారంభమవుతుంది. అదే సమయంలో కండరాలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో, పాలు, దేశీ నెయ్యి ..  ఇంగువ కలిపి తీసుకోవడం వల్ల కండరాలలో కాల్షియం, ఒమేగా-3 వృద్ధి చెందుతుంది. కండరాల బలం పెరుగుతుంది.

(ఇక్కడ ఇచ్చిన ఆరోగ్య చిట్కాలు పాఠకుల కోసం ఇచ్చిన సాధారణ సమాచారం .. ఇక్కడ ఇచ్చిన చిట్కాలను పాటించే ముందు..  ఏదైనా నివారణను ప్రారంభించే ముందు ముందు తప్పనిసరిగా వైద్యుడిని లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..