Gongura Pulihora: సంక్రాంతి స్పెషల్ గోంగూర పులిహోర.. టేస్టీగా, సింపుల్‌గా తయారీ
దాదాపు పది రోజుల ముందు నుంచే పిండివంటల హడావిడి మొదలవుతుంది. జంతికలు, అరిసెలు, పోకుండలు, సున్ని ఉండలు వంటి అనేక రకాల సాంప్రదాయ వంటలు ప్రతి ఇంట్లోని గుమగుమలను నింపుతాయి.
సంక్రాంతి అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు. రంగు రంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళ సందడిని తెస్తుంది సంక్రాంతి. దాదాపు పది రోజుల ముందు నుంచే పిండివంటల హడావిడి మొదలవుతుంది. జంతికలు, అరిసెలు, పోకుండలు, సున్ని ఉండలు వంటి అనేక రకాల సాంప్రదాయ వంటలు ప్రతి ఇంట్లోని గుమగుమలను నింపుతాయి. పండగ మూడు రోజులు తమ కుటుంబ సభ్యులకు రకరకాల వంటలతో విందు భోజనం సిద్ధం చేస్తుంది అమ్మ. ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచిని అందిస్తూ క్షణాల్లో తయారు చేసుకునే గోంగూర పులిహోర రెసిపీ తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
అన్నం-
వేరుశనగ గుళ్లు
జీడిపప్పు
పచ్చి శనగ పప్పు
సాయ మినపప్పు
ఎండు మిర్చి
ఆవాలు
పచ్చి మిర్చి
కరివేపాకు
కొంచెం పసుపు
ఇంగువ
గోంగూర ఆకులు
చింత పండు గుజ్జు
ఉప్పు రుచికి సరిపడా
నువ్వుల నూనె
నెయ్యి
కొత్తిమీర
తయారీ విధానం: ముందుగా అన్నం రెడీ చేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గోంగూర ఆకుల పేస్ట్ రెడీ చేసుకోవాలి.. గ్యాస్ స్టవ్ వెలిగించి బాణలి పెట్టి.. నూనె వేసుకుని కడిగిన గోంగూర ఆకులు వేయించి .. పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మరొక బాణలి పెట్టి.. కొంచెం నూనె, నెయ్యి వేసుకుని వేడిచేయాలి.. తర్వాత వేరు శనగ గుళ్ళు వేయించి .. తర్వాత జీడిపప్పు, శనగపప్పు, మినప పప్పు, ఆవాలు, వేయించి, తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి , వేయించి.. అప్పుడు ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తర్వాత పసుపు, తగినంత ఉప్పు వేసుకుని వేయించాలి. ఇప్పుడు చల్లారిన గోంగూరను మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ ను ముందుగా రెడీ చేసుకున్న పోపులో వేసి.. కొంచెం సేపు వేయించాలి. కమ్మటి వాసన వచ్చిన తర్వాత కొంచెం చింత పండు గుజ్జు వేసుకుని స్విమ్ లో ఉడికించాలి. తర్వాత ఈ గోంగూర పేస్ట్ ను ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నంలో వేసి కలుపుకోవాలి. ఉప్పు చూసుకుని కొంచెం నెయ్యి వేయాలి.అంతే గోంగూర పులిహోర రెడీ.. గోంగూర పేస్ట్ మిగిలితే.. గాలి తాగాలని గాజు సీసాలో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..