Biryani: ఐదు పైసలకే బిర్యానీ.. రెస్టారెంట్ ముందు భారీ క్యూ.. రెస్టారెంట్‌కి తాళం వేసి కేసు నమోదు చేసిన పోలీసులు..
ఓ రెస్టారెంట్ ఇచ్చిన ఆఫర్.. వారిని ఇబ్బందుల్లో పడేసింది. 5 పైసల నాణెం తీసుకొస్తే.. బిర్యానీ ఇస్తామన్న ఆఫర్ ప్రకటించింది. దాంతో వారు ఊహించని విధంగా రెస్టారెంట్
ఓ రెస్టారెంట్ ఇచ్చిన ఆఫర్.. వారిని ఇబ్బందుల్లో పడేసింది. 5 పైసల నాణెం తీసుకొస్తే.. బిర్యానీ ఇస్తామన్న ఆఫర్ ప్రకటించింది. దాంతో వారు ఊహించని విధంగా రెస్టారెంట్ ముందు జనాలు క్యూ కట్టారు. వారిని చూసి వామ్మో… 5 పైసల నాణేలను ఇంతమంది దాచుకున్నారా.. ద్యావుడా అంటూ నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.నంద్యాల పట్టణంలోని క్లాసిక్ జైల్ రెస్టారెంట్ నిర్వాహకులు..ఈ వినూత్న ఆఫర్ ప్రకటించారు. గుంపులు గుంపులుగా రెస్టారెంట్ ముందు వందల మంది క్యూ కట్టారు. ప్రజలు భారీగా తరలిరావటంతో రహదారిలో ట్రాఫిక్ జామ్ అయింది. బిర్యానీ కోసం జనాల మధ్య తోపులాటకూడా జరిగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. జనాలను అక్కడి నుంచి పంపించారు. రెస్టారెంట్‌కు పోలీసులు తాళం వేశారు. ఇందుకు కారణమైన రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

