Chanakya Niti: ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ కూడా ఉన్నారా? జాగ్రత్త సుమా అంటున్న చాణక్య

Surya Kala

Surya Kala |

Updated on: Jan 21, 2023 | 4:39 PM

వ్యక్తి తన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.  ఈరోజు అలంటి వ్యక్తుల గురించి  తెలుసుకుందాం.. 

Chanakya Niti: ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ కూడా ఉన్నారా? జాగ్రత్త సుమా అంటున్న చాణక్య
Acharya Chanakya

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వ్యక్తి జీవన విధానాన్ని పేర్కొన్నాడు. చాణక్యుడు తన జీవితంలో ఎక్కువ భాగం ప్రజలకు అనేక విషయాలను మార్గదర్శకత్వం చేస్తూ గడిపాడు. ఆయన త్యాగానికి ప్రాధాన్యత చరిత్రలో చోటు దక్కింది. నేటి తరానికి చాణుక్యుడు అనుసరణీయుడు. చాణక్యుడి  చెప్పిన జీవన విధానాన్ని నేటికీ ప్రజలు తమ జీవితాల్లో అన్వయించుకుంటారు.  చాణక్యుడి తన తెలివి తేటలతో సామాన్య బాలుడైన చంద్రగుప్త మౌర్యుడిని ఓ సామ్రాజ్యానికి పాలకుడిగా చేశాడు. వ్యక్తి తన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.  ఈరోజు అలాంటి వ్యక్తుల గురించి  తెలుసుకుందాం..

అత్యాశగల వ్యక్తి భార్య-భార్య లేదా కుటుంబంలోని ఎవరైనా మిమ్మల్ని ఉపయోగించుకునే మార్గాల విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. భార్యాభర్తల బంధం బాగుండాలంటే.. భార్యకు అత్యాశ ఉండకూడదని చెప్పాడు. అంతేకాదు అధిక ఖర్చులు చేసే భార్య కూడా భర్తకు ఇబ్బందులను కలిగిస్తుంది. భార్యకు అత్యాశ ఉన్న ఉంటే ఆ భర్త జీవితంలో కష్టాలు రావడం ఖాయం ఎందుకంటే.. తన దురాశతో భర్తని తరచుగా ఇబ్బందికి గురి చేస్తుంది.

అబద్ధాలు చెప్పే వ్యక్తులు  ఎవరికైనా తరచుగా అబద్ధం చెప్పే అలవాటు ఉంటే.. అలాంటి వ్యక్తులతో స్నేహం చేడు చేస్తుంది.  అబద్దాలు చెప్పే వారితో సంబంధాలు పెట్టుకోవడం అత్యంత మూర్ఖత్వం. అబద్ధాలు చెప్పే వ్యక్తి  ఏదో ఒక రోజు మీకు హానికరంగా మారవచ్చు. లేదా మిమ్మల్ని ఏదో ఒక ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. అలాంటి వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి

స్నేహితుడిగా నటించే వ్యక్తులతో  కష్ట సమయాల్లో మిమ్మల్ని విడిచిపెట్టేవారు ఏ విధంగానూ నిజమైన స్నేహితుడు కాలేడు అని ఆచార్య చాణక్యుడు చెప్పారు. తప్పుడు ఆలోచనలు,  తెలివైన వారుగా నటించే స్నేహితులకు దూరంగా ఉండటం మంచిది. అలాంటి స్నేహితుడు మీతో ఉన్నానని మాత్రమే చెప్పుకుంటాడు. అయితే సమయం వచ్చినప్పుడు..  అతను ఖచ్చితంగా తన వెన్ను చూపుతాడు. ఇలాంటి స్నేహితులతో ఉండడం కంటే ఒంటరిగా ఉండటమే మేలు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu