Chaganti-Tirumala: చాగంటి కోటేశ్వరరావు టీటీడీ ధార్మిక సలహాదారుగా నియామకం..

గత మూడు ఏళ్లలో టీటీడీ నిర్వహించిన 'పారాయణం' కార్యక్రమాలు ప్రతి వ్యక్తి చేరాలంటే.. సరైన మార్గదర్శకత్వం అవసరం కాబట్టి చాగంటి కోటేశ్వరరావు నియామకం అవసరమని తాము భావించినట్లు చెప్పారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు.

Chaganti-Tirumala: చాగంటి కోటేశ్వరరావు టీటీడీ ధార్మిక సలహాదారుగా నియామకం..
Chaganti Tirumala
Follow us
Surya Kala

|

Updated on: Jan 21, 2023 | 4:04 PM

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, వాచస్పతి, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యకలాపాలకు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం  జరిగిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్‌డిపిపి), శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌విబిసి) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమావేశం ముగిసిన అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు.

గత మూడు ఏళ్లలో టీటీడీ నిర్వహించిన ‘పారాయణం’ కార్యక్రమాలు ప్రతి వ్యక్తి చేరాలంటే.. సరైన మార్గదర్శకత్వం అవసరం కాబట్టి చాగంటి కోటేశ్వరరావు నియామకం అవసరమని తాము భావించినట్లు చెప్పారు. అంతేకాదు హిందూ ధర్మ ప్రచారాన్ని ప్రతి ఒక్కరి దగ్గరకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మారుమూల గ్రామాల్లో నివసించే గ్రామీణ యువతను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

మానవాళి శ్రేయస్సు కోసం వివిధ ప్రదేశాలలో ‘యాగాలు’ , ‘హోమాలు’ నిర్వహిస్తామని పేర్కొన్నారు.  భక్తి కార్యక్రమాలు నిర్వహించేందుకు గ్రామస్తులకు భజన, కోలాటం సామాగ్రిని అందిస్తున్నామని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.  అదేవిధంగా కొండపైన టీటీడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై తిరుమలకు తరలివస్తున్న భక్తుల అనుభవాలను ప్రసారం చేయాలని ఎస్వీబీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించిందని పేర్కొన్నారు. అంతేకాదు ఎస్వీబీసీ తెలుగు, తమిళ చానళ్ల తరహాలో కన్నడ, హిందీ చానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..