Mauni Amavasya 2023: శని అమావాస్య నాడు ఈ పరిహారాలు చేయండి.. అన్ని దుష్ప్రభావాలు తొలగిపోతాయి..
హిందూ మతంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఉదయాన్నే స్నానం చేయడం, అమావాస్య తిథి నాడు దానం చేయడం, దేవతామూర్తులకు పూజలు చేయడం వల్ల పూర్వీకులు
హిందూ మతంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఉదయాన్నే స్నానం చేయడం, అమావాస్య తిథి నాడు దానం చేయడం, దేవతామూర్తులకు పూజలు చేయడం వల్ల పూర్వీకులు, శని దేవుడి విశేష ఆశీస్సులు లభిస్తాయి. అమావాస్య తిథి శనివారం నాడు వస్తే దానిని శనైశ్చరి అమావాస్య అంటారు. ఈసారి అమావాస్య తిథి చాలా శుభప్రదమైనదిగా పేర్కొంటున్నారు పండితులు. 2023 సంవత్సరంలో వచ్చిన మొదటి శనిశ్చరి అమావాస్య ఇది. దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారు.
ఇంకో విశేషం ఏంటంటే.. ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే.. మౌని అమావస్య శనివారం నాడు వచ్చింది. ఈ రోజున చేసే ధానధర్మాలు శుభ ఫలితాలను ఇస్తాయి. వాస్తవానికి అమావాస్య తిథి పూర్వీకులకు, పెద్దలకు తర్పణ చేస్తారు. అయితే, శనిశ్చరి అమావాస్య నాడు పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని ప్రజల విశ్వాసం. 20 ఏళ్ల తరువాత ఈసారి శనివారం అమావాస్య రావడం, అది కూడా మౌని అమావాస్యం కావడంతో ప్రత్యేకత సంతకరించుకుంది. ఇంతకు ముందు 2003లో ఇలాంటి అమావాస్య వచ్చింది.
అయితే, శనివారం నాడు అమావాస్య రావడం వల్ల శని దేవుడికి ప్రత్యేక చేయిస్తే అంతా మంచి జరుగుతుంది. వేదపండితులు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శనివారం శనిదేవుడి ఆరాధనకు అంకితం చేయడం జరిగింది. శనిదేవుడు అమావాస్య తిథి నాడు జన్మించాడని పండితులు చెబుతారు. ఈ వేళ శనీశ్వరుడిని పూజించడం వల్ల మంచి జరుగుతుందని విశ్వాసం. మరి ఈ మౌని అమావాస్య రోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏలాంటి పరిహారాలు చేయొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నూనెతో అభిషేకం..
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయ దేవతగా పరిగణిస్తారు. అయితే, శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, జాతకంలో శని దోషాన్ని తొలగించడానికి మౌని అమావాస్య నాడు శని దేవుడికి ఆవాల నూనెతో అభిషేకం చేయాలి. శని దేవుడికి ఆవాల నూనెతో అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. శని దేవుడి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, గౌరవం, సంపదలు లభిస్తాయని వేదపండితులు చెబుతున్నారు.
శమీ వృక్షానికి పూజ..
శమి వృక్షమంటే శని దేవుడికి, శివుడికి చాలా ఇష్టం. శమి చెట్లు ఉన్న ఇళ్లలో సుఖశాంతులు లభిస్తాయని, నెగెటివ్ ఎనర్జీ పోతుంది. మౌని అమావాస్య నాడు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శమి చెట్టుకు పూజలు చేయాలి. శమి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించి, పూజించాలి. తద్వారా శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. చేపట్టే శుభకార్యాలయాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. జాతకంలో శని బలహీనంగా ఉన్నవారు అమావాస్య నాడు తప్పనిసరిగా శమి మొక్కను పూజిస్తే మంచి జరుగుతుంది.
రావి చెట్టుకు పూజలు..
హిందూమతంలో రావి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈచెట్టును పవిత్రంగా భావిస్తారు. దేవతకు నివాసం రావి చెట్టు అని విశ్వాసం. అందుకే.. జాతకంలో శని ప్రభావం బలహీనంగా ఉన్నట్లయితే.. అమావాస్య నాడు రావి చెట్టును పూచించాలి. రాత్రిపూట ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి. శనివారం, అమావాస్య నాడు రావి చెట్టు వద్ద ఆవనూనెతో దీపం వెలిగించడం వలన జీవితంలో ఐశ్యర్యం, ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
నీలిరంగు పువ్వులతో పూజ..
నీలిరంగు పువ్వులంటే శని దేవుడికి చాలా ఇష్టం. నీలిరంగులోని అపరాజిత పుష్పాలను శని దేవుడికి సమర్పించాలి. ఇలా చేస్తే శని దేవుడు ఆశీస్సులు లభిస్తాయి.
దానం చేయాలి..
పేదలకు సహాయం చేసే వారిపట్ల శని దేవుడు ఎప్పుడూ ఆశీస్సులు అందిస్తాడు. ఈ మౌని అమావాస్య నాడు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి పేదలకు, నిస్సహాయులకు ఏదో రకమైన సహాయం చేయాలి. శని అమావాస్య నాడు నల్ల నువ్వులు, ఉసిరి, పప్పు, బెల్లం దానం చేయడం వల్ల శుభం జరుగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..