- Telugu News Photo Gallery Cricket photos Ind vs nz 2nd odi in indore mohammed shami 4 wickets for 400 wickets mohammed siraj may join 100 wickets club
IND vs NZ: రెండో వన్డేలో స్పెషల్ రికార్డులపై కన్నేసిన టీమిండియా స్టార్ ప్లేయర్స్.. అవేంటంటే?
జనవరి 21, శనివారం ఇండోర్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. ఇందులో భారత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ప్రత్యేక విజయాన్ని సాధించే అవకాశం ఉంది.
Updated on: Jan 21, 2023 | 7:08 AM

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో సెంచరీలు, డబుల్ సెంచరీల గురించి మాత్రమే చర్చ జరుగుతోంది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ తమ బలమైన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించారు. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగే రెండో వన్డేలో కూడా వీటిపై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో 100 లేదా 200కి బదులు 400 అనే ఫిగర్ కూడా ఫోకస్ అవుతుంది.

టీమ్ ఇండియా ఈ 400 స్కోరును తాకడం మంచి విషయమే. కానీ, ఏ బ్యాట్స్‌మెన్ కూడా అలా చేయలేరు. టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఈ 400ని తాకగలడు.

వెటరన్ పేసర్ షమీ ఇండోర్‌లో న్యూజిలాండ్‌పై 4 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేస్తాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన 9వ బౌలర్‌గా అతడు నిలిచాడు.

షమీ ప్రస్తుతం టెస్టుల్లో 216, వన్డేల్లో 156, టీ20ల్లో 24 వికెట్లు తీశాడు. అందులోనూ టెస్టులు, వన్డేల్లోనే తన వికెట్ల సంఖ్యను పెంచుకుంటూనే ఉంటాడు.

హైదరాబాదీ పేసర్ సిరాజ్ తన అంర్జాతీయ కెరీర్‌లో 100 వికెట్ల మైలురాయి చేరేందుకు మరో 6 వికెట్ల దూరంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొడితే కేవలం 43 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కనున్నాడు.




