Venkata Chari |
Updated on: Jan 20, 2023 | 8:33 AM
మహిళల ఐపీఎల్ కల మరికొద్దిరోజుల్లో సాకారం కాబోతోంది. టోర్నమెంట్ మొదటి సీజన్‌ను 5 జట్లతో మార్చి 2023లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీని కోసం ఫ్రాంచైజీలు జనవరి 25న ప్రకటించనున్నాయి. అంతకు ముందు వేలం పర్స్ నుంచి విదేశీ ఆటగాళ్ల వరకు ముఖ్యమైన సమాచారం బయటకు వస్తోంది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, మహిళల ఐపీఎల్‌లో, ప్రతి జట్టు వేలం పర్స్ కోసం రూ. 12 కోట్ల వరకు బడ్జెట్‌ను పొందుతుంది. అంటే ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఉయోగిస్తారు. ఇందులో వచ్చే 5 సంవత్సరాలకు ప్రతి ఏటా రూ.1.5 కోట్లు పెరుగుతాయి. పురుషుల ఐపీఎల్‌లో వేలం పర్స్ రూ. 95 కోట్ల వరకు ఉంది.
వేలం కోసం నమోదు చేసుకున్న క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు వారి స్వంత బేస్ ధరను నిర్ణయించుకుంటారు. ఆ బేస్ ధర నుంచి వారిపై బిడ్డింగ్ ప్రారంభమవుతుంది.
పురుషుల ఐపీఎల్‌లో ప్లేయింగ్ ఎలెవెన్‌లో గరిష్టంగా 4 మంది విదేశీ ఆటగాళ్లను మాత్రమే చేర్చుకోగా, మహిళల ఐపీఎల్‌లో మాత్రం 5 మందికి చేర్చారు.
అసోసియేట్ దేశాల నుంచి ఆటగాళ్లను చేర్చుకోవడం ప్రత్యేక నియమం. ఆ ప్రకారం, ఒక జట్టు మొత్తం ఐదుగురు విదేశీ ఆటగాళ్లను రంగంలోకి దింపినట్లయితే, ఐదో ప్లేయర్ అసోసియేట్ దేశానికి చెందిన ప్లేయర్ ఉండడం తప్పనిసరి.