- Telugu News Photo Gallery Cricket photos Alex Hales Century Blows Away Abu Dhabi Knight Riders Against Desert Vipers In ILT20
7 ఫోర్లు, 6 సిక్సర్లు.. 52 బంతుల్లోనే సెంచరీ.. 186కు పైగా స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరవిహారం
తాజాగా ఈ టోర్నీలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ సెంచరీ సాధించాడు. డెసర్ట్ వైపర్స్ జట్టుకు ఆడుతున్న హేల్స్, అబుదాబి నైట్ రైడర్స్‌పై 110 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఈ టోర్నీలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌లు తర్వాత ఈ లీగ్‌లో తొలి సెంచరీ నమోదు కావడం గమనార్హం.
Updated on: Jan 21, 2023 | 8:00 AM

దక్షిణా ఫ్రికా వేదికగా జరుగుతున్న SA 20 లీగ్ ఉత్కంఠగా జరుగుతోంది. టైటిల్ కోసం జట్టు హోరాహోరీగా తలపడుతున్నాయి. అదే సమయంలో యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ కూడా క్రికెట్ ఫ్యాన్స్‌కు కావాల్సిన మజాను అందిస్తోంది.

తాజాగా ఈ టోర్నీలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ సెంచరీ సాధించాడు. డెసర్ట్ వైపర్స్ జట్టుకు ఆడుతున్న హేల్స్, అబుదాబి నైట్ రైడర్స్‌పై 110 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఈ టోర్నీలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌లు తర్వాత ఈ లీగ్‌లో తొలి సెంచరీ నమోదు కావడం గమనార్హం.

హేల్స్ కేవలం 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మ్యాచ్ మొత్తం మీద 59 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 186కు పైగానే.

కాగా ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన హేల్స్ చివరి బంతికి రనౌటయ్యాడు. మన్రో (56) తో కలిసి రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 164 పరుగులు జోడించాడు.

హేల్స్ సెంచరీతో డెసర్ట్ వైపర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆతర్వాత అబుదాబి నైట్‌రైడర్స్ కేవలం 108 పరుగులకే కుప్పకూలి 111 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.