- Telugu News Photo Gallery Cricket photos Marco Jansen hits 28 runs in Rashid khan over vs Mumbai Indians Capetown In SA20 League
6, 4, 6, 6, 0, 6.. స్టార్ స్పిన్నర్‌ను ఉతికారేసిన ఫాస్ట్ బౌలర్.. 240కు పైగా స్ట్రైక్‌రేట్‌తో విధ్వంసం
షీద్ ఖాన్ ఓవర్‌లో 4 సిక్స్‌లు, 1 బౌండరీతో 28 పరుగులు పిండుకున్నాడు జాన్సెన్. ఈ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. తన బౌలింగ్ నైపుణ్యంతో ఎంతోమంది స్టార్ క్రికెటర్లకు చుక్కలు చూపించిన రషీద్‌ఖాన్ ఆఫ్రికా బౌలర్ ధాటికి వెలవెలబోయాడు. దీంతో ముంబై జట్టుకు ఓటమి తప్పలేదు.
Updated on: Jan 20, 2023 | 7:20 AM

క్షిణాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్‌లో అగ్రశేణి స్పిన్నర్ రషీద్‌ఖాన్‌కు చుక్కలు చూపించాడు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కొ జాన్సెన్. అతని ఓవర్‌లో 4 సిక్స్‌లు, 1 బౌండరీతో కలిపి మొత్తం 28 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

SA20 లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ vs సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే జాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.

లక్ష్య ఛేదనలో 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ జట్టుకు ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు జాన్సెన్. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 66 పరుగులు చేశాడు.

ముఖ్యంగా రషీద్ ఖాన్ ఓవర్‌లో 4 సిక్స్‌లు, 1 బౌండరీతో 28 పరుగులు పిండుకున్నాడు జాన్సెన్. ఈ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. తన బౌలింగ్ నైపుణ్యంతో ఎంతోమంది స్టార్ క్రికెటర్లకు చుక్కలు చూపించిన రషీద్‌ఖాన్ ఆఫ్రికా బౌలర్ ధాటికి వెలవెలబోయాడు. దీంతో ముంబై జట్టుకు ఓటమి తప్పలేదు.





























