- Telugu News Photo Gallery Cricket photos Rohit Sharma creates new record and breaks MS Dhoni’s ODI Record For Most Sixes In India
Sixers King: ధోనిని అధిగమించి సిక్సర్ కింగ్‌గా నిలిచిన భారత కెప్టెన్.. స్వదేశంలో అత్యధిక వన్డే సిక్సులు కొట్టిన ఆటగాళ్ల లిస్ట్ ఇదే..
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే.. ఈ 2 సిక్సర్లతో రోహిత్ శర్మ నిలిచాడు కొన్ని రికార్డులను తిరగరాశాడు. అయితే స్వదేశంలో వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత సిక్సర్ కింగ్ ఎవరో చూద్దాం..
Updated on: Jan 19, 2023 | 7:36 AM

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే.. ఈ 2 సిక్సర్లతో భారత్‌లోఅత్యధిక వన్డే సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు.

అయితే స్వదేశంలో వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత సిక్సర్ కింగ్ ఎవరో చూద్దాం..

1. రోహిత్ శర్మ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్‌లో వన్డే క్రికెట్‌లో 125 సిక్సర్లు కొట్టాడు. అంతే కాకుండా వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా హిట్‌మన్ పేరిట ఉంది. రోహిత్ శర్మ 239 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 265 సిక్సర్లు బాదాడు.

5. మహేంద్ర సింగ్ ధోని: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 297 వన్డే ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 229 సిక్సర్లు కొట్టాడు. దీంతో వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన 2వ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ధోని.. ఈ జాబితాలో 5 స్థానంలో ఉన్నాడు.

3.సచిన్ టెండూల్కర్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత్‌లో మొత్తం 71 సిక్సర్లు కొట్టాడు.

4. విరాట్ కోహ్లీ: ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. భారత్‌లో ఆడిన వన్డేల్లో మొత్తం 66 సిక్సర్లు బాదిన కింగ్ కోహ్లీ నాల్గో స్థానంలో నిలిచాడు.

5. యువరాజ్ సింగ్: సిక్సర్ కింగ్‌గా పేరొందిన యువరాజ్ సింగ్ వన్డే క్రికెట్‌లో భారత్‌లో మొత్తం 65 సిక్సర్లు బాదాడు. ఈ విధంగా యూవీ లిస్ట్‌లో 5వ స్థానంలో ఉన్నాడు.




