- Telugu News Photo Gallery Cricket photos List players who have scored Double Century in ODI Cricket Format
Double Century: వన్డే చరిత్రలో ఇప్పటి వరకు డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్లు వీళ్లే.. లిస్ట్‌లో మనదే పైచేయి..
హైదరాబాద్ ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌పై బుధవారం తొలి వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ డబుల్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. దీంతో అంతర్జాతీయంగా వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన 10వ ఆటగాడిగా గిల్ నిలిచాడు. అయితే వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించినది ఓ మహిళా క్రీడాకారిణి కావడం చెప్పుకోదగిన విశేషం.
Updated on: Jan 19, 2023 | 6:50 AM

హైదరాబాద్ ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌పై బుధవారం తొలి వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ డబుల్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. దీంతో అంతర్జాతీయంగా వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన 10వ ఆటగాడిగా గిల్ నిలిచాడు. అయితే వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించినది ఓ మహిళా క్రీడాకారిణి కావడం చెప్పుకోదగిన విశేషం. అసలు ఇప్పటి వరకూ ఎవరెవరు డబుల్ సెంచరీలను సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా): 1997లో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మెలిండా క్లార్క్ డెన్మార్క్‌పై డబుల్ సెంచరీ సాధించారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది తొలి డబుల్ సెంచరీ. ఆ మ్యాచ్‌లో మెలిండా 229 పరుగులతో అజేయంగా నిలిచి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.

2. సచిన్ టెండూల్కర్ (భారతదేశం): 2010లో దక్షిణాఫ్రికాపై అజేయంగా 200 పరుగులు చేయడం ద్వారా పురుషుల వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మాన్‌గా సచిన్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా కూడా నిలిచాడు.

3. వీరేంద్ర సెహ్వాగ్ (భారతదేశం): 2011లో వెస్టిండీస్‌పై 211 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును సెహ్వాగ్ బద్దలు కొట్టాడు.

4. రోహిత్ శర్మ (భారత్): 2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 2017లో శ్రీలంకపై 208 పరుగులతో అజేయంగా మెరిశాడు. దీని తర్వాత 2014లో శ్రీలంకపై 264 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంటే వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు, మూడు సార్లు డబుల్ సెంచరీ సాధించిన రికార్డు హిట్‌మ్యాన్ పేరిట ఉంది.

5. క్రిస్ గేల్ (వెస్టిండీస్): 2015లో జింబాబ్వేపై గేల్ 215 పరుగులు చేసి డబుల్ సెంచరీల జాబితాలో చేరాడు.

6. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్): 2015లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అజేయంగా 237 పరుగులు చేసి డబుల్ సెంచరీ క్లబ్‌లో చేరాడు. అంతేకాక డబుల్ సెంచరీ చేసిన ఆరో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

7. ఫఖర్ జమాన్ (పాకిస్థాన్): 2018లో జింబాబ్వేపై పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ అజేయంగా 210 పరుగులు చేసి డబుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు.

8. అమేలియా కెర్ (న్యూజిలాండ్): 2018లో కివీస్ జట్టుకు చెందిన అమేలియా ఐర్లాండ్‌పై అజేయంగా 232 పరుగులు చేసి డబుల్ సెంచరీ బాదిన 2వ మహిళా ప్లేయర్‌గా, 8వ క్రికెటర్‌గా నిలిచింది.

9. ఇషాన్ కిషన్ (భారత్): బంగ్లాదేశ్‌పై 210 పరుగులు చేసి టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. బంగ్లాదేశ్‌పై 126 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా వేగంగా డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్ ఇప్పుడు ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతే కాక ఈ ఫీట్ చేసిన 9వ ఆటగాడిగా కూడా నిలిచాడు.

7. శుభ్‌మన్ గిల్: బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన శుభమాన్ గిల్.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ ఆటగాడిగా నిలిచాడు.




