TTD: తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం.. వివరణ ఇచ్చిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..

తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం..

TTD: తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం.. వివరణ ఇచ్చిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..
Ttd
Follow us

|

Updated on: Jan 21, 2023 | 11:24 AM

తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్‌పై వివరణ ఇచ్చారు. ఆగమశాస్ర్త నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై విమానాలు, డ్రోన్లు తిరగడం నిషేధం అన్నారు. సోషియల్ మీడియాలో వస్తున్న విజువల్స్ పై విచారణ జరుపుతున్నామని తెలిపారు. విజువల్స్ అప్‌లోడ్ చేసిన వ్యక్తి హైదరాబాద్ వాసిగా గుర్తించామని, బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఫోటోగ్రఫీ ద్వారా తీసిన ఫోటోలుగా విజిలెన్స్ అదికారులు గుర్తించారని చెప్పిన ఆయన.. అనేక కోణాలు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుట్ర కోణంలో టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారా? అన్న దిశగా కూడా విచారణ జరుపుతున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో వాస్తవాలను భక్తుల ముందుకు ఉంచుతామన్నారు.

చీఫ్ విజిలెన్స్ స్పందన..

ఇదిలాఉంటే.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోపై టీటీడీ సివిఎస్‌వో నరసింహ కిషోర్ స్పందించారు. శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియో వాస్తవం కాదని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి పరిశీలిస్తామని తెలిపారు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. సదరు వీడియోను పరిశీలించిన అనంతరం ఇందుకు కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం సృష్టించింది. శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. ఇన్‌స్టాగ్రమ్‌లో ‘ఐకాన్’ అనే అకౌంట్ నుంచి ఈ వీడియో అప్‌లోడ్ చేయగా.. రచ్చ జరుగుతోంది. ఇంత జరుగుతుంటే.. ఆలయం విజిలెన్స్ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు ఈ వీడియో వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు డ్రోన్ షాట్స్ తీసినట్లు గుర్తించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..