- Telugu News Photo Gallery No Visa Required to visit these countries for tourism check here for more details in Telugu
Visa Free Countries: వీసా లేకుండానే సందర్శించగల పర్యాటక దేశాలివే..కావాల్సింది ఇండియన్ పాస్‌పోర్ట్ మాత్రమే..
భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారు ఎవరైనా వీసా అవసరం లేకుండానే ప్రపంచంలోని కొన్ని పర్యాటక దేశాలను సందర్శించవచ్చు. మరి వీసా లేకుండా ఏయే దేశాలలోని పర్యాటక ప్రదేశాలను చూడవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 21, 2023 | 6:56 AM

భూటాన్: భారతదేశానికి అత్యంత దగ్గరగా ఉన్న పొరుగు దేశం భూటాన్‌కు మీరు వీసా లేకుండానే వెళ్లవచ్చు. అయితే మీ పర్యటన 14 రోజులలోపు ఉంటేనే, ఇక్కడ సందర్శించడానికి వీసా అవసరం లేదు.

ఫిజీ: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో, ఆస్ట్రేలియాకు ఈశాన్య దిశగా ఉన్న ఒక ద్వీప దేశం ఫిజీ. ఈ దేశంలో మీరు వీసా లేకుండా 120 రోజుల వరకు ఉండగలరు.

జమైకా: భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారికి వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించే మరో దేశం జమైకా. మీరు పర్వతాలలో, బీచ్‌లో అందమైన క్షణాలను గడపాలనుకుంటే తప్పక సందర్శించాల్సిన దేశం జమైకా.

నేపాల్: భారతీయులకు వీసా ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని నేపాల్ కూడా కల్పిస్తోంది. ఈ దేశంలో ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన పర్వత ప్రకృతి దృశ్యాలను, నేపాలీయుల కళాత్మక నిర్మాణాలను కూడా మీరు వీక్షించవచ్చు.

కజకిస్తాన్: ఈ దేశం ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కానప్పటికీ, చారిత్రక ప్రదేశాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది గొప్ప సందర్శనాత్మక ప్రదేశం. మీరు వీసా లేకుండా 14 రోజుల వరకు కజకిస్తాన్‌లో ప్రయాణించవచ్చు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో: ట్రినిడాడ్ అండ్ టొబాగో ద్వీప దేశం పర్యాటకుల యాత్రకు గొప్ప గమ్యస్థానం. మీరు వీసా లేకుండా 90 రోజుల వరకు నెవిల్లేను సందర్శించవచ్చు. ప్రకృతి, వన్యప్రాణుల ప్రేమికులకు ఇది అద్భుతమైన పర్యాటక ప్రదేశం.




