Rajitha Chanti |
Updated on: Jan 20, 2023 | 9:26 PM
తమిళ్ హీరోయిన్ అపర్ణా బాలమురళీతో ఎర్నాకులం లా కాలేజీ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. తన్కమ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ లా కాలేజీని సందర్శించారు. ఆ సమయంలో ఆమె స్టేజ్ పై ఉండగా.. ఓ విద్యార్థి ఆమెతో దురుసుగా ప్రవర్తించారు.
తాజాగా ఈ ఘటనపై స్పందించారు హీరోయిన్ అపర్ణా బాలమురళి. ఆ యువకుడి ప్రవర్తన తనను బాధించిందని అన్నారు. అంగీకారం లేకుండా ఓ మహిళను తాకడం అనేది నేరమన్న విషయం ఆ మాత్రం తెలియదా..? అని ప్రశ్నించారు.
కుర్చీలోంచి బలవంతంగా నన్ను లేపేందుకు.. నా చేయిని పట్టుకునేందుకు ప్రయత్నించడం సరైంది కాదు. నా భుజం మీద చేయి వేసేందుకు కూడా ప్రయత్నించాడు. ఒక మహిళతో అతడు ప్రవర్తించాల్సిన పద్ధతి ఇది కాదు అని అన్నారు.
ఈ ఘటనపై నేను ఫిర్యాదు చేయదల్చుకోలేదు. ఫిర్యాదు చేసి దాని వెనుక పరిగెత్తే సమయం నాకు లేదు. కానీ, అతడి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది అపర్ణ.
'అంగీకారం లేకుండా మహిళను తాకడం నేరమని తెలియదా ?'.. యువకుడి ప్రవర్తనపై హీరోయిన్ సీరియస్..