Nagoba Jatara: గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష.. నాగోబా అభవృద్ధికి ప్రణాళికలు పంపితే నిధులిస్తామన్న కేంద్ర మంత్రి అర్జున్ ముండా
నాగోబా ఆలయ అభవృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్రానికి పంపిస్తే నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నాగోబా జాతరకు వచ్చిన అర్జున్‌ముండాకు..
గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు కేంద్ర గిరిజన శాఖా మంత్రి అర్జున్ ముండా. నాగోబా ఆలయ అభవృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్రానికి పంపిస్తే నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నాగోబా జాతరకు వచ్చిన అర్జున్‌ముండాకు.. మెస్రం వంశీయులు, ఆలయ కమిటీ ఘనంగా స్వాగతం పలికారు. అర్జున్‌ముండా వెంట బండి సంజయ్, ఎంపీ సోయం బాపూరావు ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇవే ఆఖరి బడ్జెట్ సమావేశాలని విమర్శించారు బండి సంజయ్ . ఆయన్ను ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గిరిజనులంటే కేసీఆర్‌కు చులకన అని.. అందుకే అతిపెద్ద నాగోబా జాతరను విస్మరించారని ఆరోపించారు. ఈ 8 ఏళ్లలో సీఎం కేసీఆర్ ఒక్కసారైనా నాగోబాకు ఎందుకు రాలేదని నిలదీశారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే నాగోబా జాతరను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు బండి సంజయ్. దేశం గర్వపడేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
కేస్లాపూర్ చేరుకుని గిరిజన ఆరాధ్యదైవమైన నాగోబాను దర్శించుకోనున్నారు నేతలు. నాలుగు గంటలపాటు గిరిజనులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో నేతలు పాల్గొననున్నారు. మధ్యాహ్నం స్థానిక ఫంక్షన్ హాలులో పాల్గొని అర్జున్ ముండా, బండి సంజయ్ ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు నేతలు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర నిన్న అర్థరాత్రి వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ ఏడాది పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ఉత్సవాలు మొదలవుతుంది. అమావాస్య అర్ధరాత్రి నుంచి ఈ నెల 28వ తేది వరకు జరుగుతాయి. ఈ జాతరను గిరిజిన కుంబమేలగా అభివర్ణిస్తారు.
నాగోబా జాతరకు కోసం ఈ ఉదయం హైదరాబాద్‌కున్న కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా.. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో నాగోబా జాతరకు చేరుకున్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెంట ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం