AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వెంటాడి.. వెంబడించి.. అందరూ చూస్తుండగా.. కత్తులతో నరికి నరికి చంపేశారు..

సాయంత్రం వేళ.. అందరూ చూస్తుండగా.. జరిగిన దారుణ హత్య భాగ్యనగరం హైదరాబాద్ ఉలిక్కిపడింది. ఓ వ్యక్తిని టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. అత్యంత విచక్షణ రహితంగా కత్తితో నరికి చంపేశారు. కత్తులు, వేట..

Hyderabad: వెంటాడి.. వెంబడించి.. అందరూ చూస్తుండగా.. కత్తులతో నరికి నరికి చంపేశారు..
Murder
Ganesh Mudavath
|

Updated on: Jan 22, 2023 | 6:42 PM

Share

సాయంత్రం వేళ.. అందరూ చూస్తుండగా.. జరిగిన దారుణ హత్య భాగ్యనగరం హైదరాబాద్ ఉలిక్కిపడింది. ఓ వ్యక్తిని టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. అత్యంత విచక్షణ రహితంగా కత్తితో నరికి చంపేశారు. కత్తులు, వేట కొడవళ్లతో దాడి చేశారు. బాధితుడు పరిగెడుతున్నా.. ఆగకుండా వెంబడించి మరీ హత్య చేశారు. పురానాపూల్‌ సమీపంలోని జియాగూడ బైపాస్‌ రోడ్డు వద్ద జరిగిన ఈ దారణ హత్యోదంతంతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న కుల్సుంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పాట్ ను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

కాగా.. మృతి చెందిన వ్యక్తి కోఠి ఇస్తామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్‌ గా గుర్తించారు. అయితే.. నిందితులు ఎవరు? ఎందుకు అతన్ని హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి దూరం నుంచి వీడియో తీశారు. ముగ్గురు చుట్టుముట్టి ఒక వ్యక్తిని కిరాతకంగా నరుకుతున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

రోజురోజుకు నగరంలో పెరిగిపోతున్న నేరాలతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు ఎక్కువవుతుండటంతో.. నిఘా పెంచాలని కోరుతున్నారు సిటిజెన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం