Nagendra Babu: అనంతపురంలో పర్యటిస్తోన్న నాగబాబు.. రోడ్లు మాదరిగానే ఏపీలో పరిస్థితులు ఉన్నాయంటూ..

రోడ్లు మాదరిగానే ఏపీలో పరిస్థితులు కూడా అధ్వాన్నంగా ఉన్నాయన్నారు జనసేన నేత నాగబాబు. అనంత పర్యటనలో ఉన్న ఆయన..నగరంలోని రోడ్లను పరిశీలిస్తున్నారు.

Nagendra Babu: అనంతపురంలో పర్యటిస్తోన్న నాగబాబు.. రోడ్లు మాదరిగానే ఏపీలో పరిస్థితులు ఉన్నాయంటూ..
Nagababu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 22, 2023 | 1:36 PM

జనసేన నేత నాగబాబు అనంతపురంలో పర్యటిస్తున్నారు. పట్టణంలోని రోడ్లను పరిశీలించారు నాగబాబు. శ్రమదానంతో రోడ్లను  బాగు చేస్తామన్నారు నాగబాబు. రోడ్లు మాదరిగానే ఏపీలో పరిస్థితులు కూడా అధ్వాన్నంగా ఉన్నాయన్నారు జనసేన నేత నాగబాబు. అనంత పర్యటనలో ఉన్న ఆయన..నగరంలోని రోడ్లను పరిశీలిస్తున్నారు. పోలీసులు నోటీసులిచ్చినా తమ పని తాము చేస్తామన్నారు నాగబాబు. వారాహి టూర్ త్వరలోనే ఉంటుందన్న ఆయన… పొత్తులపై ఏ నిర్ణయమైనా పవనే తీసుకుంటారని తెలిపారు.

అనంతపురం నగరంలోని గుంతలు, రోడ్లను మట్టితో బాగు చేసి శ్రమదానం చేయాలని పిలుపునిచ్చింది జనసేన. అయితే జనసేన శ్రమదానం చేయాలనుకున్న చోటరాత్రికి రాత్రే మరమ్మతులు చేశారు అధికారులు. అయితే ఇంకా నగరంలో చోట్ల రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయని…అక్కడ శ్రమదానం చేసి తీరుతామంటున్నారు నేతలు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ నోటీసులు జారీచేశారు పోలీసులు

జనసేన ర్యాలీలు, సభకు ఎలాంటి అనుమతి కోరలేదని జిల్లా SP ఫకీరప్ప స్పష్టం చేశారు.. కానిస్టేబుల్ పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాగబాబు పర్యటనపై పోలీసుు ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు.

ఇదిలా ఉంటే అనంతపురంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ పర్యటనపై కాంట్రవర్సీ కాకరేపుతోంది. నగరంలో గుంతలు, రోడ్లను మట్టితో బాగు చేసి శ్రమదానం చేయాలని పిలుపునిచ్చింది జనసేన. అయితే జనసేన శ్రమదానం చేయాలని ఎక్కడైతే కార్యక్రమం చేపట్టందో అక్కడ రాత్రికి రాత్రే అధికారులు మరమ్మతులు చేపట్టారు.

ఇంకా అనంతపురం పట్టణంలో చాలా చోట్ల రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయంటున్నారు జనసేన నేతలు. గుంతలు ఉన్న చోట శ్రమదానం చేసి తీరుతామన్నారు. మరోవైపు జనసేన తలపెట్టిన శ్రమదానానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అంతేకాదు ఈ రోజు పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో శ్రమదానం కార్యక్రమానికి అనుమతి లేదంటూ నోటీసులు జారీచేశారు.