Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakha: ప్రియుడిపై మోజుతో.. ప్రేమ వ్యవహారంలో మందలించిన తండ్రిపై కూతురు కత్తితో దాడి.. బాలిక అరెస్ట్

ప్రేమే గొప్పదంటు.. తమ తల్లిదండ్రులను బద్ధ విరోధుల్లా భావిస్తున్న అమ్మాయిల గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. ప్రేమ వ్యవహారంలో మందలించిన తండ్రిపై కూతురు ఏకంగా కత్తితో దాడి చేసింది.

Visakha: ప్రియుడిపై మోజుతో.. ప్రేమ వ్యవహారంలో మందలించిన తండ్రిపై కూతురు కత్తితో దాడి.. బాలిక అరెస్ట్
Visakha News
Follow us
Surya Kala

|

Updated on: Jan 22, 2023 | 2:29 PM

ప్రేమ పెళ్లి విషయంలో పిల్లలకు.. తల్లిదండ్రులకు మధ్య సయోధ్య కుదరదేమో.. తమ ప్రేమని అంగీకరించడం లేదని పిల్లలు తల్లిదండ్రులమీద ఫిర్యాదు చేస్తే.. మేము ఏమైనా మా పిల్లలకు శత్రువులమా.. కనిపెంచిన మాకు మా పిల్లల మంచి చెడుల గురించి అక్కర ఉండగా అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు తల్లిదండ్రులను కాదని ప్రేమ పేరుతొ ఇంటి నుంచి వెళ్ళిపోయిన యువతలు కొందరు బలైపోతున్న వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ వీటిని పరిగణ లోకి తీసుకోకుండా ప్రేమే గొప్పదంటు.. తమ తల్లిదండ్రులను బద్ధ విరోధుల్లా భావిస్తున్న అమ్మాయిల గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. ప్రేమ వ్యవహారంలో మందలించిన తండ్రిపై కూతురు ఏకంగా కత్తితో దాడి చేసింది… ఈ దారుణ ఘటన విశాఖ జిలాల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

విశాఖ లో హత్యాయత్నం కలకలం రేగింది. తండ్రి పై కూతురు కత్తి తో దాడి చేసింది. శంకరమఠం ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రేమ వ్యవహారం లో మందలించినందుకు తండ్రిపై అక్కసు పెట్టుకున్న కూతురు.. తండ్రి పై దాడి చేసినట్లు తెలుస్తోంది.  పోలీసులకు తండ్రి ముకుందరావు ఫిర్యాదు చేయడంతో..బాలికను అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. ప్రియుడికి ఇంటిలోని నగలు నగదు దొంగలించి ఎవరికీ తెలియకుండా ఇచ్చివేసింది. అంతేకాదు.. మరిన్ని డబ్బులు ఇవ్వమని తండ్రిని కోరింది. అయితే కూతురుకి తండ్రి డబ్భులు ఇవ్వడానికి అంగీకరించలేదు… దీంతో తండ్రి కూతురు మధ్య వివాదం మొదలైంది. తరువాత కూతురు తండ్రిపై ఏకంగా కత్తి తో దాడి చేసిందని గుర్తించారు పోలీసులు.

Reporter: khaja

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..