Vande Bharat Express: కాస్త మారండి గురూ.. రైళ్లు కూడా మన ఇళ్ల వంటివే..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహణ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అయితే ఈ నెల15 న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం ఆయిన వందే భారత్ ట్రైన్ ను ప్రయాణీకులు మురికి కూపం లా చేస్తున్నారంటూ రైల్వే అధికారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

Vande Bharat Express: కాస్త మారండి గురూ.. రైళ్లు కూడా మన ఇళ్ల వంటివే..
Vande Bharat Train
Follow us

|

Updated on: Jan 21, 2023 | 5:05 PM

దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ‘వందే భారత్‌ రైలు’ తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన సికింద్రాబాద్‌– విశాఖపట్నం రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక సదుపాయాలు..  విమానం తరహాలో సీటింగ్ తో మిగిలిన రైళ్లతో పోలిస్తే.. దీని నిర్వహణ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అయితే ఈ నెల15 న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం ఆయిన వందే భారత్ ట్రైన్ ను ప్రయాణీకులు మురికి కూపం లా చేస్తున్నారంటూ రైల్వే అధికారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణీకులు తాము తాగి, తిన్న తర్వాత వ్యర్ధాలను, కప్పులు, ప్లేట్స్ ను కోచ్ లలోనే పడేస్తున్నారని.. చాలా చెత్తాచెదాలతో నింపేస్తూ.. ఆపరిశుధ్యపాలు చేస్తున్నారంటూ రైల్వే అధికారులు మదనపడి పోతున్నారు. ఉదయం విశాఖ నుంచి శుభ్రం గా వెళ్ళే ట్రైన్ తిరిగి రాత్రికి చేసుకునే సరికి కంపు కంపు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రయాణీకులు ఒక్కసారి ఆలోచించాలని రైల్వే ఉన్నతాధికారుల చేతులు జోడించి వేడుకుంటున్నారు.

వ్యక్తి గతంగా మనం ఎలా శుభ్రంగా ఉంటామో అలానే ట్రైన్ ను కూడా శుభ్రంగా ఉంచాలంటూ వేడుకుంటున్నారు వాల్తేర్ డివిజన్ డీ అర్ ఎం అనూప్ కుమార్. చెత్త, చెదారం, వ్యర్థాల కోసం ట్రైన్ లో ఉన్న డస్ట్ బిన్ లను వాడాలని కోరుతున్నారు. ఇది మన గౌరవానికి సంబందించిన సమస్య అంటూ చురకలు కూడా అంటిస్తున్నారు రైల్వే ఉన్నతాధికారులు.

ఇవి కూడా చదవండి

ఈ రైలుకు మొత్తం 16 ఏసీ బోగీలుంటాయి.. 1,128 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆటోమేటిక్‌ డోర్స్, స్మోక్‌ అలారం, సీసీ టీవీ కెమెరాలు, బయో వ్యాక్యూమ్‌ టాయ్‌లెట్స్, సెన్సార్‌తో పనిచేసే నల్లాలు, ఫుట్‌రెస్ట్‌లు వంటి ఆధునిక సదుపాయాలున్న సంగతి తెలిసిందే.. ఈ ట్రైన్ టికెట్ ధరను బట్టి.. ఈ రైలులో ప్రయాణించేవారు ఎక్కువగా ధనికులు, ఉద్యోగాలు వంటి వారే ఉండే అవాకాశం  తెలిసిందే.

Reporter: Eswar

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్