AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagababu: వైసీపీ అసలు పార్టీనే కాదు.. అలీ కామెంట్స్ పై నాగబాబు రియాక్షన్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అధికార పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన లీడర్ నాగబాబు.. వైసీపీ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అసలు పార్టీనే...

Nagababu: వైసీపీ అసలు పార్టీనే కాదు.. అలీ కామెంట్స్ పై నాగబాబు రియాక్షన్ ఇదే..
Janasena Pac Nagababu
Ganesh Mudavath
|

Updated on: Jan 21, 2023 | 2:45 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అధికార పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన లీడర్ నాగబాబు.. వైసీపీ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అసలు పార్టీనే కాదని.. దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది? ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు? అనే విషయాలను అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని వెల్లడించారు. రాయలసీమ జిల్లాల్లో పార్టీ బలంగా ఉందన్న నాగబాబు.. దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కర్నూలులో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన.. ఈ కామెంట్స్ చేశారు. గ్రామ స్థాయి నుంచి జన సైనికులు బలంగా ఉన్నారన్న నాగబాబు.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇంఛార్జీలను నియమించాలన్నారు.

పవన్ కల్యాణ్ పై అలీ పోటీ చేస్తానన్న ప్రకటనపై కామెంట్ చేయదలుచుకోవడం లేదు. పొత్తులపై తుది నిర్ణయం పవన్ కల్యాణ్‌దే. పొత్తులు లేకుండా ఉంటే కర్నూలు జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది. పొత్తులు ఉంటే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముందుకు వెళతాం. ఏపీలో పాలన చెత్తగా ఉంది. నాలుగేళ్లుగా అరాచకం, రౌడీ రాజ్యం, గంజాయి రాష్ట్రంగా మారిపోయింది.

       – నాగబాబు, జనసేన నేత

ఇవి కూడా చదవండి

కాగా.. ఆంధ్రప్రదేశ్ పొత్తుల వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతోంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పొత్తుల విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఒకవైపు జనసేనతో పొత్తు దాదాపు ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఎన్నికలకు ఏడాది సమయమే ఉంది. ఇటువంటి తరుణంలో 175 నియోజకవర్గాలను గెలుచుకోవాలనడం అంటే.. ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న వైనాట్ 175కు కౌంటర్ ఇవ్వడానికి ఈ వ్యాఖ్య చేశారా? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి