Unique Love: మరణించిన భార్య ప్రతిరూపాన్ని తయారు చేయించిన భర్త.. నగలతో అలంకరించి నిత్యం పూజలు

సాధారణంగా తమకిష్టమైన వారు మరణిస్తే విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు.. సమాధులు నిర్మించి వారి జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు.. అందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తాట్యాతండాలో జాటోతు వాల్యానాయక్ అనేవ్యక్తి తన భార్యపై ప్రేమను చాటుతున్నాడు..

Unique Love: మరణించిన భార్య ప్రతిరూపాన్ని తయారు చేయించిన భర్త.. నగలతో అలంకరించి నిత్యం పూజలు
Unique Love
Follow us
Surya Kala

|

Updated on: Jan 21, 2023 | 2:20 PM

ప్రాణంగా ప్రేమిస్తే ప్రాణం ఉన్నంతవరకు మాత్రమే కాదు… ప్రాణంపోయినా ఆ ప్రేమ చావదని నిరూపిస్తున్నారు ఓ గిరిజన రైతు కుటుంబం… తన భార్య ప్రతిరూపాన్ని టేకు కలపతో తయారు చేయించి నిత్యపూజలు చేస్తున్నారు.. ఆమె ఆభరణాలు ఆ కలప ప్రతిరూపానికి వేసి నిజమైన ప్రేమను చాటుతున్నారు. సాధారణంగా తమకిష్టమైన వారు మరణిస్తే విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు.. సమాధులు నిర్మించి వారి జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు.. అందుకు భిన్నంగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తాట్యాతండాలో జాటోతు వాల్యానాయక్ అనేవ్యక్తి తన భార్యపై ప్రేమను చాటుతున్నాడు.. ఏడాది క్రితం చనిపోయిన తన భార్య చిత్రాన్ని టేకు కలప పై చెక్కించి ఆరాదిస్తున్నారు..

వాల్యానాయక్ భార్య పకీరాబాయి ఏడాది కిందట మృతిచెందింది.. తన భార్యను మరిచిపోలేకపోయిన ఈ గిరిజన రైతు తన జీవిత భాగస్వామిని వినూత్న రీతిలో ఆరాదిస్తున్నాడు.. తనతో పాటుగా ఎడ్లబండిపై గడిపిన క్షణాన్ని మనసులో నెమరవేసుకుంటూ టేకు కలపతో ఎడ్ల బండి బొమ్మను తయారు చేయించాడు.. అందులో తన భార్య ఫకీరాబాయి ప్రతి రూపాన్ని చెక్కించారు. ఆ చిత్రాన్ని ఆభరణాలతో అలంకరించి రోజూ పూజ చేస్తున్నారు.

తన ప్రాణ సఖి దర్శనం లేనిదే తన దినచర్య మొదలు కాదని.. తన భార్య ఏడబాటును మరిచి తమలో మమేకమై ఉన్నట్లుగా భావించి కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో ప్రతి ఈవెంట్ ను వైభవంగా జరుపుకుంటారు. తల్లి మరణం తర్వాత ఆమె నగలు కూతుర్లకు చెందడం సంప్రదాయం.. కానీ ఫకీరాబాయి కుమార్తెలు అందుకు విభిన్నంగా తల్లి బ్రతికున్నప్పుడు ఎలా అలంకరించుకునేదో తన మరణం తర్వాత కూడా అలాగే ఆరాదిస్తున్నారు.. తండ్రి ఎంతో ప్రేమగా చేయించిన టేకు కలపపై తన ప్రతిరూపానికి ఆ నగలు అలంకరించి మురిసిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..