Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dera Chief Ram Rahim: అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు మళ్ళీ 40 రోజులు పెరోల్

డేరా బాబా తన సిర్సా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు నెలల క్రితం పెరోల్ మీద రిలయ్యారు.. మళ్ళీ తాజాగా  40 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయబడింది.

Dera Chief Ram Rahim: అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు మళ్ళీ 40 రోజులు పెరోల్
Gurmeet Ram Rahim Singh
Follow us
Surya Kala

|

Updated on: Jan 20, 2023 | 9:56 PM

అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు మళ్ళీ పెరోల్‌ లభించింది. హర్యానాలోని సనారియా జైలులో ఖైదీగా ఉన్న   డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు శుక్రవారం మరోసారి పెరోల్ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.  డేరా బాబా తన సిర్సా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు నెలల క్రితం పెరోల్ మీద రిలయ్యారు.. మళ్ళీ తాజాగా  40 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయబడింది. డేరా బాబాకు నిబంధనల ప్రకారమే పెరోల్ ఇచ్చినట్లు రోహ్‌తక్ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ తెలిపారు.

ఇదే విషయంపై హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా, డేరా చీఫ్ తాజా పెరోల్ అభ్యర్థనపై వ్యాఖ్యానిస్తూ.. 40 రోజుల పెరోల్ కోరుతూ డేరా బాబా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఈ పెరోల్ వ్యవధిలో..గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ జనవరి 25న డేరా మాజీ చీఫ్ షా సత్నామ్ సింగ్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెప్పాయి.

డేరా చీఫ్‌ 40 రోజుల పెరోల్ గత ఏడాది నవంబర్ 25న ముగిసింది. అక్టోబర్ 14న విడుదలైన ఆయన ఉత్తరప్రదేశ్‌లోని తన బర్నావా ఆశ్రమానికి వెళ్లారు. అక్టోబరు-నవంబర్‌లోని పెరోల్ సమయంలో బర్నావా ఆశ్రమంలో అనేక ఆన్‌లైన్ ‘సత్సంగ్’లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొందరు హర్యానాకు చెందిన బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇక అక్టోబర్‌లో పెరోల్‌కు ముందు.. జూన్‌లో నెల రోజుల పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు వారాల ముందు ఫిబ్రవరి 7, 2022 నుండి మూడు వారాలు పెరోల్ మంజూరు చేయబడింది.

ఇదే విషయంపై సిక్కుల అత్యున్నత మత సంస్థ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు తరచుగా పెరోల్ ఇవ్వడం గురించి ప్రస్తావిస్తూ.. సుమారు మూడు దశాబ్దాలుగా జైళ్లలో ఉన్న సిక్కు ఖైదీలను వారి శిక్షలు పూర్తయినా విడుదల చేయడం లేదని SGPC అధ్యక్షుడు హర్జీందర్ సింగ్ ధామీ ఆరోపించిన సంగతి తెలిసిందే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..