World Gold Council: 611 టన్నుల కొనుగోలుతో సెకండ్ ప్లేస్‌లో భారత్.. మరి ప్రపంచంలో పసిడి ప్రియులు ఏ దేశస్థులో తెలుసా..

Surya Kala

Surya Kala |

Updated on: Jan 20, 2023 | 9:28 PM

గోల్డ్‌కు ఇండియన్స్‌ ఇచ్చే ఇంపార్టెన్స్‌ అంతా ఇంతా కాదు. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు.. డీ-మార్ట్‌ తరహాలో భారీగా జనంతో కనిపిస్తుంటాయి చాలా నగల దుకాణాలు. బంగారం కొనుగోలు విషయంలో ధర పెరిగిందా, తగ్గిందా అనే విషయంపై సంబంధం ఉండదు. 

World Gold Council: 611 టన్నుల కొనుగోలుతో సెకండ్ ప్లేస్‌లో భారత్.. మరి ప్రపంచంలో పసిడి ప్రియులు ఏ దేశస్థులో తెలుసా..
World Gold Council

భారతీయులు పసిడి ప్రియులని ప్రపంచ ఖ్యాతి. మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న బంగారం నిల్వలు.. కొన్ని దేశాలకంటే ఎక్కువే.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ తమ స్థాయికి తగిన విధంగా పసిడి కొనుగోలుకు ఆసక్తిని చూపిస్తారు. 24 క్యారెట్‌ కావచ్చు, 22 క్యారెట్‌ కావచ్చు, లేటెస్ట్‌గా వస్తున్న 18 క్యారెట్‌ నగలు కావచ్చు ..  బంగారం ఎప్పటికీ బంగారమే. గోల్డ్‌కు ఇండియన్స్‌ ఇచ్చే ఇంపార్టెన్స్‌ అంతా ఇంతా కాదు. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు.. డీ-మార్ట్‌ తరహాలో భారీగా జనంతో కనిపిస్తుంటాయి చాలా నగల దుకాణాలు. బంగారం కొనుగోలు విషయంలో ధర పెరిగిందా, తగ్గిందా అనే విషయంపై సంబంధం ఉండదు.  అయితే ప్రపంచంలో పసిడి కొనుగోళ్లు విషయంలో భారత్ నెంబర్ వన్ అనుకుంటున్నారా.. అయితే మీ ఆలోచన రాంగ్.. బంగారు ఆభరణాల కొనుగోలులో భారత్ ది రెండో ప్లేస్‌ అని చెప్తోంది వల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్. బంగారం కొనేందుకు మనకు ప్రత్యేకంగా అక్షయ తృతీయ, ధన్‌తేరస్‌ వంటివి పండగలు కూడా ఉన్నాయి. ఇంత ఎగబడినా బంగారం కొనుగోలు విషయంలో మనది సెకండ్‌ ప్లేసే.

2021 చైనా కొన్న బంగారం 673 టన్నులు. అదే భారత్ లో ఇది 611 టన్నులు మాత్రమే. ఇక నగల కొనుగోలును పరిశీలిస్తే మన దేశంలో  అమ్మే నగల్లో సగం బ్రైడల్‌ జ్యూయలరీయే. పెళ్లి నగల బరువు సగటున 30 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు ఉంటాయి. ఇందులో నెక్లెస్సులు, చోకర్లు, హారాల వాటా అధికం. మొత్తం నగల అమ్మకాల్లో బ్రైడల్‌ జుయెలరీ వాటా 50-55 శాతంగా ఉందని నివేదికలు చెప్తున్నాయి.

ఇక ఈ మధ్య బాగా పాపులర్‌ అయిన డైలీ వేర్‌ కేటగిరీలో ఎక్కువ వరకు ఐదు నుంచి 30 గ్రాముల బరువుతో కూడిన నగలు ఎక్కువుంటున్నాయి. మొత్తం నగల సేల్స్‌లో డైలీ వేర్‌ వాటా 35-40 శాతంగా ఉంది. అంతేకాదు రోజు ధరించే నగల కంటే తక్కువ బరువుండే ఫ్యాషన్‌ జుయెలరీలో నగల బరువు ఐదు నుంచి 20 గ్రాములు మించవు. మొత్తం నగల అమ్మకాల్లో వీటి వాటా 5 నుంచి 10 శాతంగా ఉంది. ఇందులో మంగళసూత్రాలు, ఇయర్‌ రింగ్స్‌, చైన్స్‌ అధిక సంఖ్యలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

బంగారం ధర పెరుగుతున్నా బ్రైడల్‌ జుయెలరీపై ఏ మాత్రం ప్రభావం అంతగా కనిపించడం లేదు. యువ జనాభాతో కళకళలాడుతున్న భారత్‌లో రానున్న రోజుల్లో వివాహ ఆభరణాల డిమాండ్‌ మరింత పెరుగుతుంది తప్ప తగ్గదని వల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తోంది.

ధర తక్కువతో 18 క్యారెట్‌, 14 క్యారెట్‌ నగలను ఈ మధ్య కాలంలో చాలా సంస్థలు ప్రవేశపెడుతున్నా వాటి డిమాండ్‌ మాత్రం అంతంతగానే కనిపిస్తోంది. మొత్తం అమ్మకాలను చూస్తే 22 క్యారెట్‌ నగల వాటా 80 శాతంగా ఉంది. 18 క్యారెట్‌, 14 క్యారెట్స్‌ రెండింటి వాటా 15 నుంచి 17 శాతంగా ఉంది. అయితే 18, 14 క్యారెట్‌ ఆభరణాల సేల్స్‌లో గడిచిన 10 ఏళ్లుగా పెరుగుదల కనిపిస్తోంది. ఈ కేటగిరీలో అమ్మకాలు పెంచుకునేందుకు మోడ్రన్‌ డిజైన్స్‌, డైమండ్స్‌తో ఆభరణాలను సంస్థలు తీసుకొస్తున్నాయి. స్టడెడ్‌ డైమండ్‌ జుయెలరీలో ఎక్కువ మటుకు 14 లేదా 18 క్యారెట్‌ గోల్డ్‌లోనే రూపొందిస్తున్నారు. ఎందుకంటే డైమండ్‌ జ్యుయెలరీని చాలా మంది ప్యాషన్‌గా ఎంచుకుంటారు తప్ప దాన్ని పెట్టుబడిగా చూడరు.

దేశీయ కొనుగోళ్లే కాదు భారత్‌కు విదేశీ మార్కెట్‌ కూడా విస్తృత స్థాయిలో ఉంది. ఇండియా ఎక్స్‌పోర్ట్‌ చేసే గోల్డ్‌ జుయెలరీలో UAE, అమెరికా, హాంకాంగ్‌, సింగపూర్‌, బ్రిటన్‌ – ఈ ఐదు దేశాల వాటా 90 శాతం. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా భారత్  146 దేశాలకు నగలను ఎగుమతి చేస్తోంది. భారతీయులు అధికంగా ఉండే ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆభరణాల వర్తకులు చాలా మంది ఆన్‌లైన్‌ సేల్స్‌పై దృష్టి పెట్టడం కూడా వారికి కలిసొస్తుంది. ఎంత బంగారం బంగారమే కదా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu