Ratan Tata: వ్యక్తిత్వంలో వజ్రం.. మన జాతికి దొరికిన రత్నం.. ఇది కదా జీవితానికి సార్థకత అంటే.. దాతృత్వం కోసం రతన్ టాటా మరో ట్రస్ట్
దేశభక్తి, ఉద్యోగుల పట్ల అనురక్తి, వ్యాపార విస్తరణలో యుక్తి ఆయన సొంతం. జీవనశైలిని గమనిస్తే స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వం దర్శనమిస్తుంది. అధికారం, హోదా ఉన్నప్పటికీ రతన్ టాటా సాధారణ జీవితాన్నే ఇష్టపడే ఆయన ఇప్పుడు తనకు సామజిక సేవ, ఆపన్నుల పట్ల ఉన్న ప్రేమని మరో సారి ప్రపంచానికి వెల్లడించారు.
మనం ఇతరుల నుంచి నేర్చుకోవాలన్న.. ఇతరులను మనం నేర్పాలన్నా.. ఇన్స్పిరేషన్ కోసం, మోటివేషన్ కి ఎక్కడెక్కడో వెతుకుతాం. ఒకొక్కసారి ప్రపంచం డబ్బు చుట్టూనే తిరుగుతుందని అంటారు. కొందరు తమ దగ్గర ఎంత ఉన్నా.. ఇతరులకు ఏదైనా సాయం అడుగుతారేమో అని ముందుగానే మాకు ఏముంది అంటూ నిరాసక్తగా వ్యాఖ్యానిస్తారు. అయితే మనం సరిగ్గా పరిశీలించం గానీ మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో విలువలు పాటించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రపంచ వ్యాపార రంగం లో రతన్ టాటా వంటి అత్యున్నత మైన వ్యక్తి నేటి కాలంలో లేరని చెప్పవచ్చు.. ఎందరో మహానుభావులు.. అందులో రతన్ టాటా గారు లివింగ్ లెజెండ్
పెద్దగా పరిచయం అక్కరలేని పేరు రతన్ టాటా.. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిన గొప్ప వ్యాపారవేత్త. దేశభక్తి, ఉద్యోగుల పట్ల అనురక్తి, వ్యాపార విస్తరణలో యుక్తి ఆయన సొంతం. జీవనశైలిని గమనిస్తే స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వం దర్శనమిస్తుంది. అధికారం, హోదా ఉన్నప్పటికీ రతన్ టాటా సాధారణ జీవితాన్నే ఇష్టపడే ఆయన ఇప్పుడు తనకు సామజిక సేవ, ఆపన్నుల పట్ల ఉన్న ప్రేమని మరో సారి ప్రపంచానికి వెల్లడించారు.
టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా మరో వ్యక్తిగత ఎండోమెంట్ ట్రస్ట్‌ను సృష్టించారు. రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ గతేడాది సెప్టెంబర్‌లో స్థాపించబడింది. ఎస్టేట్ ప్లానింగ్ లక్ష్యంతో న్యాయ నిపుణులు ఆధ్వర్యంలో నడవనుంది.. ఈ ఫౌండేషన్ కు డైరెక్టర్‌లుగా రాఘవన్ రామచంద్ర శాస్త్రి, బుర్జిస్ షాపూర్ లు నియమించబడ్డారు.కార్పస్ నుండి వచ్చే ఆదాయాన్ని భవిష్యత్ లో స్వచ్ఛంద సంస్థలకు నిధులు సమకూర్చడం కోసం ఉపయోగించే విధంగా ఎస్టేట్ ప్లానింగ్ స్థాపించబడింది.
85 ఏళ్లు నిండిన టాటా నికర ఆస్తుల విలువ రూ. 3,500 కోట్లు. ఇంతటి భారీ సంపద ఉన్నప్పటికీ, పారిశ్రామికవేత్తగా సంపన్నుడి స్థానంలో ఆయనకు చోటు దక్కలేదు. దీనికి కారణం టాటా ట్రస్ట్‌ల ద్వారా ఆయన చేస్తున్న భారీ విరాళాలు, దాతృత్వ కార్యక్రమాలే అని తెలుస్తోంది. టాటా సన్స్ సంస్థ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 66 శాతం ఆరోగ్యం, విద్య, ఆరోగ్యం, కళలు, సంస్కృతి సహా అనేక సామజిక కార్యక్రమాల నిర్వహణ కోసం వినియోగిస్తున్నారు. అనేక ట్రస్ట్‌లను నిర్వహిస్తున్నారు.
ఎండోమెంట్ ఫండ్స్ సాధారణంగా కొన్ని రకాల ధార్మిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఆదాయాన్ని సంపాదించడానికి సృష్టించబడతాయి. వీటిల్లో కొన్ని స్వచ్ఛంద ప్రయోజనాల కోసం దాతలు పెట్టుబడి పెట్టబడతాయి.. తర్వాత ట్రస్టులుగా స్థాపించబడ్డాయి. ఎండోమెంట్ ఫండ్ లబ్ధిదారుడు ఎటువంటి లాభాపేక్ష లేని వ్యక్తి. పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రముఖులు ఇప్పుడు తమ సంపదను దాతృత్వ కోసం వివిధ సంస్థలలోకి మళ్లిస్తున్నారు.
రతన్ టాటా దాతృత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్ రెండింటినీ అందుకున్న రతన్ టాటా సెప్టెంబరులో ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్ కొత్త ట్రస్టీలలో ఒకరిగా ఎంపికయ్యారు. అందరినీ సమానంగా చూసుకోవడమే చాలా మందికి స్ఫూర్తినిస్తుందని నమ్మే దార్శనికుడు రతన్ టాటా. టాటా గ్రూప్ ఛైర్మన్ నే కాదు గొప్ప సామాజిక కార్యకర్త , గొప్ప నాయకుడు నిస్వార్థంతో కూడిన అతని జీవనశైలి. వందలాది కోట్లకు అధిపతి అయినా అందరితో కలిసిపోయే తత్త్వం, ఆయన దేశ భక్తి నేటి తరానికి ఆదర్శం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..